Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మరో సూపర్ హిట్ అందుకున్న సుహాస్

Ambajipeta Marriage Band Collections: ఈవారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే సంక్రాంతి సినిమాలో జోరు తగ్గుతుండగా  థియేటర్లోకి 10 చిన్న సినిమాలు అడుగుపెట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. అయితే ఈ పది సినిమాలలో కేవలం ఒక్క సినిమా మాత్రమే సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2024, 06:03 PM IST
Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మరో సూపర్ హిట్ అందుకున్న సుహాస్

Ambajipeta Marriage Band First  Week Collections:

కలర్ ఫోటో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో సుహాస్. అంతకుముందు కొన్ని సినిమాలలో అలానే కొన్ని వైవిధ్యమైన పాత్రలలో కనిపించిన కలర్ ఫోటో చిత్రం సుహాస్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ సినిమాతో హీరోగా మారిన ఈ నటుడు ఆ తరువాత హిట్ చిత్రంలో విలన్ గా కూడా కనిపించాడు. ఇక ఈ మధ్య వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమాతో హీరోగా మరో  హిట్ కూడా అందుకున్నారు.

ఇలా వరుస విజయాలు సాధించిన సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మరోసారి  వైవిద్యమైన కథను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సైతం ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తు మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. 

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ వైపు అడుగులు వేస్తోంది ఈ చిత్రం. సుహాస్ నటన, శరణ్య పాత్ర, శేఖర్ చంద్ర సంగీతం, దుష్యంత్ డైరెక్షన్ ఇలా ప్రతీ ఒక్క అంశం ఈ సినిమాను హిట్టు చేసేశాయి. అలానే ఈ సినిమాతో హీరోగా సుహాస్ హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నారు.

ఈ సినిమాకు శుక్రవారం, శనివారం కలెక్షన్స్ మొత్తం కలుపుకుంటే.. 5.16 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా వసూళ్లకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు రోజుల్లోనే ఐదు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఈ వారం విజేతగా నిలిచేందుకు ముందుకు వరుసలో ఉంది. ఈవారం ఏకంగా 10 చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ పది సినిమాలలో ఈ సినిమాకి మినహా మరే సినిమాకి కూడా కనీసం మినిమం టాక్ కూడా రాలేదు. సుహాస్ సినిమాకు మాత్రం ప్రేక్షకులు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మంచి కంటెంట్‌తో వస్తే సినిమాలు హిట్ అవుతాయని మరోసారి రుజువు చేసింది ఈ చిత్రం.

ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, జి ఎ 2 పిక్చర్స్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంస్థల పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించగా ‘బన్నీ వాస్’ ‘వెంకటేష్ మహా’ సమర్పకులుగా వ్యవహరించారు. దుష్యంత్ కటికనేని ఈ చిత్రానికి దర్శకుడు.

Also Read: Medaram Jathara 2024: భక్తులకు అలర్ట్‌.. మేడారం జాతరకు వెళ్తుంటే ఇవి మీ వెంట కచ్చితంగా ఉండాల్సిందే..!

Also Read: Lemon in Auction: వేలంలో రూ.1.5 లక్షలు పలికిన నిమ్మకాయ.. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News