V Movie: సుధీర్ బాబు ఫిట్‌నెస్‌పై ఇన్‌స్పైరింగ్ వీడియో

న్యాచురల్ స్టార్ నాని ( Nani ), సుధీర్ బాబు ( Sudheer Babu ), నివేదా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన V Movie ఇవాళే OTT ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు పాత్రకు భారీ ప్రశంసలే దక్కాయి.

Last Updated : Sep 5, 2020, 10:21 PM IST
V Movie: సుధీర్ బాబు ఫిట్‌నెస్‌పై ఇన్‌స్పైరింగ్ వీడియో

న్యాచురల్ స్టార్ నాని ( Nani ), సుధీర్ బాబు ( Sudheer Babu ), నివేదా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన V Movie ఇవాళే OTT ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు పాత్రకు భారీ ప్రశంసలే దక్కాయి. ఈ సినిమా కోసం సుధీర్ బాబు తన శరీరాకృతిని మార్చుకున్న తీరు అద్భుతంగా కనిపించింది. సిక్స్ ప్యాక్ బాడీతో పాటు కండలు తిరిగిన శరీర సౌష్టవంతో సుధీర్ బాబు భారీ స్టంట్స్ చేసి ఆకట్టుకున్నాడు. Also read : V Movie leaked: పైరసీ బారిన పడిన V ఫుల్ మూవీ

ఈ సినిమా మొదలుపెట్టడానికి ముందుగా ఓ ప్రమాదంలో సుధీర్ బాబు ఎడమ కాలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. ఆ సమయంలో వీల్ చైర్‌లోంచి లేవడానికి కూడా ఓపిక లేని సుధీర్ బాబు.. ఇంట్లోని జిమ్‌లోనే కాలితో చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేస్తూ ఆ నొప్పిని అధిగమించడం విశేషం. అలాంటి దశ నుంచి కొన్ని రోజుల వ్యవధిలోనే వి సినిమా షూటింగ్‌లో చేరి భారీ స్టంట్స్ చేసే స్థాయికొచ్చాడు. Also read : F3 Movie: F3 మూవీ ఎక్కడివరకు వచ్చింది ? లేటెస్ట్ అప్‌డేట్స్..

 

ఎట్టకేలకు వి సినిమా ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చిన నేపథ్యంలో ట్విటర్ ద్వారా ఓ వీడియో షేర్ చేసుకున్న సుధీర్ బాబు.. '' ఏదైనా నొప్పి అనేది మీ శత్రువు కాదని.. అది మిమ్మల్ని మోటివేట్ చేసే మోటివేటర్'' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. తాను కాలు నొప్పితో బాధపడుతున్న రోజుల నుంచి మొదలుకుని జిమ్‌‌లో ఫిట్‌నెస్ కోసం కసరత్తులు చేస్తున్న దృశ్యాలు  ( Sudheer Babu's fitness secrets ), వి మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాలను సుధీర్ బాబు ఆ వీడియోలో పొందుపర్చాడు. ఎంతో ఇన్‌‌స్పైరింగ్‌గా ఉన్న ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. Also read : Railway jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1,40,640 ఉద్యోగాలు

Trending News