Sudheer Babu: క్రేజీ కాంబినేషన్‌లో మూడో సినిమా

టాలీవుడ్‌ యాక్షన్ హీరో సుధీర్ బాబు, క్రేజీ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్‌లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనుంది. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ కాంబినేషన్‌‌లో మరో సినిమాను ప్రకటించారు దర్శక, నిర్మాతలు.

Last Updated : Nov 15, 2020, 12:47 PM IST
Sudheer Babu: క్రేజీ కాంబినేషన్‌లో మూడో సినిమా

Sudheer Babu's third film in Crazy Combination: టాలీవుడ్‌ యాక్షన్ హీరో సుధీర్ బాబు, క్రేజీ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్‌లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనుంది. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ కాంబినేషన్‌‌లో మరో సినిమాను ప్రకటించారు దర్శక, నిర్మాతలు. సుధీర్ బాబు - మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో గ‌తంలో సమ్మోహనం, ఆ తరువాత నాని, సుధీర్ ప్రధాన పాత్రల్లో ‘వీ’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండు చిత్రాలు కూడా మంచి విజ‌యాన్నే సాధించాయి. అయితే వీ సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా అనౌన్స్ చేయడంతో.. దీనిపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. రోమాంటిక్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని టాక్. అయితే సుధీర్ బాబు కోసమే ఈ స్క్రిప్ట్‌ను ఇంద్రగంటి ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు.

అయితే ఈ సినిమా బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందనుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన ఉప్పెన సినిమా హీరోయిన క్రితి శెట్టి నటించనుంది. దీనికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించనున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళుతుందని పేర్కొంటున్నారు. అయితే తారగణం, సినిమా టైటిల్ తదితర వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. Also read: Telangana: గోదావరిలో నలుగురు యువకుల గల్లంతు

 

 Also read: Amyra Dastur: మతిపోగొడుతున్న అమైరా..

Also read: Malavika Mohanan: అందంతో హీటెక్కిస్తున్న మాళవిక

Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?

Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe  

Trending News