Rajamouli on Mahesh Movie: మహేష్ తో అలాంటి కధ...ఒక్క పదంతోనే అంచనాలు పెంచేసిన జక్కన్న!

SS Rajamouli says Mahesh Babu Movie will be globetrotter action adventure:  తాజాగా మహేష్ బాబుతో చేసే సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 13, 2022, 06:03 PM IST
Rajamouli on Mahesh Movie: మహేష్ తో అలాంటి కధ...ఒక్క పదంతోనే అంచనాలు పెంచేసిన జక్కన్న!

SS Rajamouli says Mahesh Babu Movie will be globetrotter action adventure: ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ అటు మహేష్ బాబు ఇటు రాజమౌళి ఇద్దరూ కూడా తాము కలిసి సినిమా చేస్తున్నామనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతానికి మహేష్ బాబు త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. హారిక హాసిని బ్యానర్ మీద భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ తరువాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా ప్రారంభించనున్నారు. అయితే తాజాగా మహేష్ బాబుతో చేసే సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.

ప్రస్తుతానికి టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి అక్కడే తన తదుపరి చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి మహేష్ బాబుతో చేసే సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక ప్రపంచ యాత్రికుడి కధ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్నామని ఆయన అన్నారు.

ఇక ఈ సినిమాని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. దీనికోసం ఆయన రెండు కథలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకటి అమెజాన్ అడవులలో ఉన్న నిధి వేట అంటే ఒక ట్రెజర్ హంట్ లాంటి కధ సిద్ధం చేయగా మరొకటి జేమ్స్ బాండ్ తరహా అడ్వెంచర్స్ కథ అని తెలుస్తోంది. అయితే ఇందులో రాజమౌళి చెబుతున్న దాన్ని బట్టి చూస్తే జేమ్స్ బాండ్ తరహా కథకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రపంచ యాత్రికుడి లాగా కనిపించబోతున్న మహేష్ బాబు ఎలాంటి యాక్షన్ అడ్వెంచర్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ ముగిసిన తర్వాత సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు, హీరో, నిర్మాత ఎవరనే విషయం మీద క్లారిటీ వచ్చింది, కానీ మిగతా టెక్నీషియన్లు అలాగే నటీనటుల విషయం మీద ఎలాంటి క్లారిటీ రాలేదు.
Also Read: 
No Remake Heros: ఎన్ని డిజాస్టర్లు వచ్చినా ఒక్క రీమేక్ జోలికి కూడా పోని హీరోలు ఎవరో తెలుసా?

Also Read: The Ghost Movie: చిరు కోసం నాగ్ త్యాగం చేయడం లేదట.. పోటీ పక్కా ఇక!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News