రాజమౌళి నిజంగానే ఆ పూజలు చేయిస్తున్నాడా ?

Last Updated : Jan 16, 2018, 05:49 PM IST
రాజమౌళి నిజంగానే ఆ పూజలు చేయిస్తున్నాడా ?

టాలీవుడ్‌లో టాప్ మోస్ట్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళిని ఇప్పటివరకు అదృష్టం వెన్నంటి వుందా ? అందుకే ఆయన పట్టిందల్లా బంగారమైందా ? అన్నింటికిమించి బాహుబలి, బాహుబలి 2 సినిమాలు తెరకెక్కించిన సమయంలో ఆయనకు శుక్రమహార్దశ నడిచినందు వల్లే ఆ సినిమాలు తిరుగులేని సక్సెస్ అయ్యాయా ? ఇవీ ఇప్పుడు సోషల్ మీడియాలో రాజమౌళి గురించి కొనసాగుతున్న చర్చలు.. అందులో కొంతమంది లేవనెత్తుతున్న ప్రశ్నలు. అందుకు కారణం రాజమౌళి గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు మంత్రాలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తున్నట్టు ఓ ప్రచారం జరగడమే. ఇందులో ఎంతమేరకు వాస్తవం వుందనే విషయంలో క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం అటు సోషల్ మీడియా ఇటు తెలుగు మీడియా కథనాల ప్రకారం వేద పండితులు ఇచ్చిన ఓ సలహాను పాటిస్తున్న రాజమౌళి మంత్రాలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తున్నాడనే టాక్ మాత్రం వినిపిస్తోంది.

శుక్ర మహార్దశ పూర్తి చేసుకుని ప్రస్తుతం మరో దశలోకి అడుగుపెడుతున్న రాజమౌళికి ఇకపై కాలం కలిసొచ్చే అవకాశం లేదని, అందుకే గ్రహాల అనుకూలత కోసమే ఈ ప్రత్యేక పూజలు చేయిస్తున్నాడనేది ఆ టాక్ సారాంశం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే రాజమౌళినే దీనిపై స్పందించి ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడితే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. జక్కన్న ఏమని స్పందిస్తాడో చూడాలి మరి!!

Trending News