Rajamouli Birthday: రాజ‌మౌళి బ‌ర్త్ డే.. ఆర్ఆర్ఆర్ ఆన్‌లొకేష‌న్ స్టిల్స్‌తో విషెస్‌

Jr NTR, Ramcharan warm wishes to Rajamouli: రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) హీరోలు, అందులో నటిస్తున్న పలువురు నటులు రాజమౌళికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2021, 05:57 PM IST
  • నేడు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పుట్టినరోజు
  • సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ
  • ఆన్‌లొకేష‌న్ స్టిల్స్ విడుద‌ల చేస్తూ జక్కన్నకు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపిన ఆర్ఆర్‌‌ఆర్‌‌ టీమ్
Rajamouli Birthday: రాజ‌మౌళి బ‌ర్త్ డే.. ఆర్ఆర్ఆర్ ఆన్‌లొకేష‌న్ స్టిల్స్‌తో విషెస్‌

SS Rajamouli Birthday: Jr NTR, Ramcharan and others extend warm wishes to Director SS Rajamouli: నేడు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రాజమౌళి సినిమా జర్నీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తన నాన్న దగ్గర చేస్తే సొంత గుర్తింపు ఉండదని.. హైదరాబాద్‌కు (Hydearabad) వచ్చి గుణ్ణం గంగరాజు ఇంట్లో కొన్నాళ్లు ఉన్నారు జక్కన్న. తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendrarao) దరికి చేరారు. శాంతినివాసం సీరియల్‌కి పని చేశారు. జక్కన్న (Jakkanna) పనిచేసే తీరు దర్శకేంద్రుడికి నచ్చింది. అలా మొదలైన రాజమౌళి (Rajamouli) జర్నీ ఇప్పుడు ప్రపంచం మెచ్చే స్థాయికి వెళ్లింది.

రాజమౌళికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు

‘బాహుబలి’తో (bahubali) టాలీవుడ్‌ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో వచ్చే సంక్రాంతి బరిలోకి దిగనున్నారు. రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ (RRR) (రౌద్రం రణం రుధిరం) హీరోలు, అందులో నటిస్తున్న పలువురు నటులు రాజమౌళికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగాప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan), బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ (Ajay Devgn) ఆన్‌లొకేష‌న్ స్టిల్స్ విడుద‌ల చేస్తూ జక్కన్నకు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Also Read : MAA Elections 2021: ముగిసిన మా ఎన్నికలు, ఓటు వేయని స్టార్ హీరోలు

విషెస్ తెలిపిన మహేశ్ బాబు, అజయ్ దేవగణ్

డియర్ జక్కన హ్యాపీ బర్త్ డే టు యు లవ్ యూ అంటూ తారక్ చెప్పారు. చరణ్ "రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు" అని తెలిపారు.

అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ లో (RRR) ముఖ్య పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ (Ajay Devgn) "ఎంతో అద్భుతమైన వర్క్ ఎక్స్ పీరియన్స్ అలాగే ఎంతో నేర్పించిన దర్శకుడు రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు" అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఆలియా భట్ కూడా జక్కన్నకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక త్వరలో రాజమౌళితో (Rajamouli) సినిమా చేయబోతున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు (MaheshBabu) కూడా రాజమౌళికి బర్త్ డే విషెస్ తెలిపారు.

 

Also Read : Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్‌ ప్రీత్ సింగ్‌..త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న రకుల్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News