Samajavaragamana OTT: 'సామజవరగమన' ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే?

Samajavaragamana OTT: యువ నటుడు శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సామజవరగమన. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ అయింది. థియేటర్లలో కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అలరించేందుకు సిద్దమైంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2023, 10:44 AM IST
Samajavaragamana OTT: 'సామజవరగమన' ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే?

Samajavaragamana OTT: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ 'సామజవరగమన'. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సీనియర్ నటుడు నరేష్, శ్రీవిష్ణు మధ్య వచ్చే కామెడీ సీన్స్ మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. అంతేకాకుండా వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ నటన కూడా ఆకట్టుకుంటోంది. చిన్న సినిమాగా (Samajavaragamana) వచ్చి ఈ సినిమా సాలిడ్ హిట్ కొట్టింది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సుమారు రూ.50 కోట్ల వరకు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. 

జూన్ 29న థియేటర్లలో రిలీజ్ అయి సక్సెస్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయింది. ఈమూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. ఈ క్రమంలో ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది ఆహా.  సామజవరగమన సినిమాను జులై 28న ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది.

Also Read: Project K Glimpse: హాలీవుడ్ రేంజ్‌లో 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్ గ్లింప్స్.. టైటిల్ ఏంటో తెలుసా?

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్‌ హీరోయిన్‌గా నటించింది. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌, ప్రియ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా నిర్మించారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఆహాలో చూసేయండి. 

Also Read: Peka Medalu: 'బాహుబలి' సేతుపతి, 'ఎవరికి చెప్పొద్దు' ఫేమ్ రాకేష్ వర్రే నిర్మాణంలో వస్తున్న 'పేక మేడలు' ఫస్ట్ లుక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News