Samajavaragamana OTT: అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన 'సామజవరగమన'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Samajavaragamana OTT: థియేటర్లలో నవ్వులు పూయించిన ‘సామజవరగమన’ సినిమా అనుకున్న సమయానికంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా గురువారం రాత్రి 7 గంటల నుంచి స్ట్రీమింగ్ మెుదలయ్యింది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2023, 06:47 AM IST
Samajavaragamana OTT: అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన 'సామజవరగమన'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Samajavaragamana Movie in Ott: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కెరీర్ లో బిగ్గెస్ బ్లాక్ బస్టర్ 'సామజవరగమన'(Samajavaragamana Movie). గత నెలలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సుమారు రూ.7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.50 కోట్లకుపైగా రాబట్టింది. రామ్అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్(Reba Monica John)  హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో నరేశ్, శ్రీకాంత్అయ్యంగార్, వెన్నెల కిషోర్, సుదర్శన్, రాజీవ్కనకాల కీలక పాత్రల్లో నటించారు.

థియేటర్లలో విడుదలై విజయవంతమైన ఈ సినిమా అనుకున్న డేట్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ జూలై 28న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ జూలై 27 రాత్రి 07 గంటల నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. మీకు నవ్వుల పండుగ కాస్త ఎర్లీగానే మెుదలవుతుంది. చల్లని వాతావరణంలో వెచ్చగా ఆహాలో సామజవరగమన చూస్తూ ఎంజాయ్ చేద్దాం అని ఆహా ట్వీట్ చేసింది. 

సామజవరగమన సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర సమర్పించగా.. రాజేశ్ దండా నిర్మాతగా వ్యవహారించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. బాలు క్యారెక్టర్లో హీరో శ్రీవిష్ణు, అతడి తండ్రి పాత్రలో నరేశ్ కామెడీ టైమింగ్తో ఇరగదీశారు. జూన్ 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా క్లీన్ కామెడీతో భారీ హిట్ సాధించింది. ఈ చిత్రానికి ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కూడా దక్కాయి. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.

Also Read: Bhola Shankar Trailer: భోళా శంకర్ ట్రైలర్ విడుదల.. రామ్‌చరణ్ బాబులా చేశాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News