Sr NTR@75Years: అన్న ఎన్టీఆర్ నట ప్రస్థానానికి 75 యేళ్లు పూర్తి.. ఈ నెల 14న అతిరథ మహారథుల సమక్షంలో గ్రాండ్ సెలబ్రేషన్స్..

Sr NTR@75Years: ఎన్టీఆర్.. ఇది పేరు కాదు.. ఒక హిస్టరీ.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ కొన్ని పేజీలే కాదు ఓ పుస్తకమే ఉంది. అటు రాజకీయంగా కూడా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఆయన తొలి చిత్రం ‘మన దేశం’ విడుదలై 75 యేళ్లు పూర్తి కావొస్తోంది. ఈ సందర్బంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయడానికి రెడీ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 6, 2024, 01:16 PM IST
Sr NTR@75Years: అన్న ఎన్టీఆర్ నట ప్రస్థానానికి 75 యేళ్లు పూర్తి.. ఈ నెల 14న అతిరథ మహారథుల సమక్షంలో గ్రాండ్ సెలబ్రేషన్స్..

Sr NTR@75Years: దాదాపు 100 యేళ్లకు చేరవు అవుతున్న తెలుగు చిత్ర పరిశ్రమలో అన్న ఎన్టీఆర్ కు కొన్ని పేజీలున్నాయి. నటుడిగా ఆయన  ప్రస్థానం 75 యేళ్ల క్రితమే ‘మన దేశం’ మూవీ నుంచే మొదలైంది. నటరత్న అన్న పద్మశ్రీ డాక్టర్ యన్.టి. రామారావు గారు యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ  "మన దేశం" 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 14వ తేదిన విజయవాడలో ఒక వేడుకను నిర్వహించడానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ డిసైడ్ అయింది.  

ఆ వేడుక ఏర్పాట్లను గురించి చర్చించుటకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హైదరాబాద్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటిలో  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణా స్టేట్ చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రతినిధి అందరూ కలిసి పై వేడుకను గురించి చర్చించారు. ఈ వేడుకకు సినీ ప్రదర్శకులు, సినీ పంపిణీదారులు, సినీ నిర్మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనుటకు నిర్ణయించడమైనది. ఈ వేడుకకు సినీ పరిశ్రమ నుంచి బాలయ్య, పవన్ సహా పలువురు నిర్మాతలు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ప్రముఖులు ఈ వేడుకలకు హాజరు కాబోతున్నట్టు సమాచారం.

1949 నవంబర్ 24న ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘మన దేశం’ సినిమా విడుదలైంది. అప్పటి మీర్జాపురం రాజా నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించారు. తొలి సినిమాలో అన్నగారు బ్రిటిష్ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. అందులో ఓ సన్నివేశంలో లాఠీతో కొట్టే సీన్ లో నిజంగా బాదారు. ఈ రకంగా నటన కాకుండా జీవించడం మొదలైంది తొలి చిత్రంతోనే కావడం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు హీరోయిన్ లేదు. ఈ సినిమాలో అప్పటి తొలి తెలుగు సూపర్ స్టార్ నాగయ్య కథానాయకుడిగా నటించారు.

ఆ తర్వాత ఎన్టీఆర్.. షావుకారు సినిమాలో తొలిసారి హీరోగా నటించారు. ఆ తర్వాత కేవి రెడ్డి దర్శకత్వంలో విజయ బ్యానర్ లో తెరకెక్కిన ‘పాతాళ భైరవి’ మూవీతో ఎన్టీఆర్ తెలుగు లేని స్టార్ డమ్ దక్కించుకున్నారు. ఆ తర్వాత కథానాయకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు.

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News