ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో..

Squid Game Telugu Trailer: ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. ఇండియాలోని ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ సిరీస్.. ఇప్పుడు భారత్ లోని అనేక భాషల్లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. తెలుగు, తమిళం, హిందీ లలో డబ్ చేసి ఈ సిరీస్ ను విడుదల చేయనున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన ట్రైలర్లు వివిధ భాషల్లో విడుదల అయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 09:08 PM IST
ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో..
Squid Game Telugu Trailer: ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది సెప్టెంబరు 17న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ కొరియన్ వెబ్ సిరీస్.. 27 రోజుల్లోనే 11 కోట్లకు పైగా వీక్షణలు సంపాందించింది. దాదాపు 90 దేశాల్లోని ఓటీటీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఇప్పటికీ ఎక్కువమంది చూసిన నెంబరు.1 వెబ్ సిరీస్ గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత దేశంలోనూ ఈ సిరీస్ కు విపరీతమైన క్రేజ్ లభించింది. 
దాన్ని దృష్టిలో పెట్టుకొని.. భారత్ లోని అనేక భాషల్లో డబ్ చేసి.. విడుదల చేసేందుకు నెట్ ఫిక్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ట్రైలర్ ను రిలీజ్ చేసింది. యూట్యూబ్ వేదికగా విడుదలైన ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ ట్రైలర్ ఎలా ఉందో మీరు చూసేయండి.   

Also Read: నయనతారకు సామ్‌ బర్త్‌డే విషెస్‌, నయన్,సామ్ వీడియో వైరల్

Also Read: హేమ మాలిని, ప్రసూన్ జోషికి ‘'ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్' అవార్డు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News