/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

SP Balasubrahmanyam Health update: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై వస్తున్న ఫేక్ న్యూస్ కథనాలపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ( SP Charan ) తీవ్రంగా స్పందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ఆయనకు ఊపిరితిత్తుల మార్పిడి జరగనుందని, అభిమానుల కోసం ఎస్పీ బాలు ఐసియు నుంచే పాట పాడేందుకు నిర్ణయించుకున్నారని.. ఇలా రకరకలా అవాస్తవ కథనాలను ( Fake news ) మీడియా ప్రచురించడం వల్ల ఒక్కరోజే ఎంతో మంది ఆందోళనకు గురై తనకు ఫోన్లు చేశారని ఎస్పీ చరణ్ తెలిపాడు. నాన్న క్రమక్రమంగా కోలుకుంటున్నారని... ప్రస్తుతం ఆయన ఎక్మో సపోర్టుపైనే చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చరణ్ పేర్కొన్నాడు. నాన్న ఆరోగ్యం గురించి ఏ విషయం ఉన్నా తాను కానీ లేదా ఆసుపత్రి వర్గాలు కానీ అధికారికంగా చెబుతాయని.. అప్పటివరకు ఫేక్ న్యూస్ కథనాలు రాయొద్దని చరణ్ మీడియాకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు చరణ్ ఎప్పటిలాగే తన ఇన్‌స్టా‌గ్రామ్ ఖాతా ద్వారా ఓ వీడియో విడుదల చేశాడు. Also read : Antarvedi chariot fire case: అంతర్వేది రథం దగ్ధం కేసులో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on

ప్రతీరోజు నాన్నను కలుస్తున్నాను అని చెప్పిన చరణ్.. ఆయన ఆరోగ్యంలో పెద్దగా మార్పులు లేనందున ప్రతీ రోజూ ఈ విషయంపై తాను మాట్లాడటం లేదని వివరించాడు. ఏదేమైనా మీ ప్రార్థనలు ఫలిస్తున్నాయని.. ఆయన క్రమక్రమంగా కోలుకుంటున్నారని చరణ్ తేల్చిచెప్పాడు. Also read : Rana Daggubati movies: రానా దగ్గుబాటి చేతికే సురేష్ ప్రొడక్షన్స్ ?

Section: 
English Title: 
SP Charan requests media to avoid fake news about SP Balasubrahmanyam health condition
News Source: 
Home Title: 

SP Balasubrahmanyam Health condition: అది ఫేక్ న్యూస్.. నమ్మొద్దు: ఎస్పీ చరణ్

SP Balasubrahmanyam Health condition: అది ఫేక్ న్యూస్.. నమ్మొద్దు: ఎస్పీ చరణ్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
SP Balasubrahmanyam Health condition: అది ఫేక్ న్యూస్.. నమ్మొద్దు: ఎస్పీ చరణ్
Publish Later: 
Yes
Publish At: 
Thursday, September 10, 2020 - 23:03