గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) ఆరోగ్యం పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆగస్టు 5న కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్ అని తేలడంలో బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ( MGM hospital ) చేరిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరే సమయానికి స్వల్ప లక్షణాలతోనే ఉన్న ఆయన.. ఆ తర్వాత కరోనా లక్షణాలు ( Corona symptoms ) అధికమై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఐసీయూలోకి తరలించి లైఫ్ సపోర్టుపై చికిత్స అందిస్తున్నామని ఇటీవల ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు జారీచేసిన ఓ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నాయి. Also read : Adipurush: ఆదిపురుష్‌లో విలన్ పాత్రకు స్టార్ హీరో
తాజాగా బుధవారం సాయంత్రం 5:15 గంటలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ ( SP Balasubrahmanyam health bulletin ) విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి.. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది. ప్రస్తుతం ఆయన బీపీ, టెంపరేచర్, పల్స్ రేటు వంటివి ( Vital parameters ) సాధారణ స్థాయిలోనే ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు ఈ హెల్త్ బులెటిన్ ద్వారా తెలియజేశాయి. Also read : Kormo jobs app: ఉద్యోగం కావాలా ? ఈ మొబైల్ యాప్ ట్రై చేయండి అంటున్న గూగుల్
బాలసుబ్రహ్మణ్యం కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన అభిమానులు, ఆయనతో సన్నిహితంగా ఉండే సినీ ప్రముఖులు ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. Also read : Bigg Boss 4: బిగ్ బాస్ 4 లో ఫేమస్ కొరియోగ్రాఫర్ ?
SP Balasubrahmanyam: విషమంగానే బాలు ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల