Sonu Sood mortgaged his properties: నిరుపేదల కోసం సోనూ సూద్ ఆస్తులు తనఖా పెట్టాడా ?

కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో చాలామంది నిరుపేదలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆకలితో అలమటించారు. లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో సొంతూళ్లకు వెళ్లే మార్గం లేక, ఖాళీగా ఉంటూ ఇళ్ల కిరాయిలు చెల్లించుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు.

Last Updated : Dec 10, 2020, 01:04 AM IST
  • లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు పడిన వాళ్లకు తనకు తోచిన సహాయం చేయడానికి తీవ్రంగా కృషి చేసిన సోనూ సూద్.
  • లాక్‌డౌన్‌లో నిరుపేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సోనూ సూద్.. అందుకోసం ముంబైలో ఉన్న 8 ఆస్తులను తనకా పెట్టాడట.
  • ముంబైలోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో సెప్టెంబర్ 15న మార్టగేజ్ లోన్ ( Mortgage loan ) కోసం దరఖాస్తు చేసుకున్న సోనుసూద్.
Sonu Sood mortgaged his properties: నిరుపేదల కోసం సోనూ సూద్ ఆస్తులు తనఖా పెట్టాడా ?

కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ సమయంలో చాలామంది నిరుపేదలు అనేక ఇబ్బందులుపడ్డారు. ఆకలితో అలమటించారు. లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో సొంతూళ్లకు వెళ్లే మార్గం లేక, ఖాళీగా ఉంటూ ఇళ్ల కిరాయిలు చెల్లించుకోలేక నానా ఇబ్బందులకు గురయ్యారు. 

లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడిన వాళ్లకు తనకు తోచిన సహాయం చేయడానికి కొంతమంది మనసున్న మారాజులు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో అందరికంటే ఎక్కువగా చెప్పుకోవాల్సిన పేరు ప్రముఖ నటుడు సోనూ సూద్‌ది. 

సోనూ సూద్ సినిమాల్లో వేసేది విలన్ వేషమే అయినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం ఎంతో మందికి ఎంతో సాయం చేసి వారి దృష్టిలో దేవుడయ్యాడు. 

విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులను భారత్‌లో వారి సొంతింటికి చేర్చాడు. దేశంలోని ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్.. ఇలా దేశం నలుమూలలా చిక్కుకుని సొంతూర్లకు వెళ్లాలని కోరుకున్న వాళ్ల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి మరీ వారిపాలిట దేవుడయ్యాడు. 

అయితే, లాక్ డౌన్ కాలంలో నిరుపేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సోనూ సూద్.. అందుకోసం ముంబైలోని జుహూలో ఉన్న 8 ఆస్తులను తనకా పెట్టాడనే టాక్ వినిపిస్తోంది. 

Also read: Sonu sood: సోనూకు హీరో ఆప్ ది ఇయర్‌గా అరుదైన గౌరవం అందించిన యాహూ

జుహూ అంటేనే ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతం. సినీ ప్రముఖులు, రాజకీయ నేతల నుంచి బిలియన్లకు పడగలెత్తిన వ్యాపారులు నివాసం ఉండే ఖరీదైన ప్రాంతం.

అలాంటి జుహూలో ఉన్న ఆస్తులను తనఖా పెట్టి మరీ నిరుపేదలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడా అంటే అవుననే తెలుస్తోంది. జుహూలో తనతో పాటు తన భార్య సొనాలి సూద్ జాయింట్ ఓనర్స్‌గా ఉన్న 8 ప్రాపర్టీస్‌ని సోనూ సూద్ తనఖా పెట్టినట్టు వార్తలొస్తున్నాయి.

సోనూసూద్ తనఖా పెట్టిన ఆస్తుల్లో ( Sonu Sood mortgaged his properties ) రెండు దుకాణాలు కాగా మరో 6 నివాస యోగ్యమైన ఫ్లాట్స్ ఉన్నాయని సమాచారం. నిరుపేదలకు అవసరమైన సహాయం చేయడం కోసం అవసరమైన రూ. 10 కోట్ల నిధులను సమకూర్చుకోవడం కోసమే జుహూలో ఆస్తులను మార్టగేజ్ చేసినట్టు ముంబై మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ముంబైలోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో సెప్టెంబర్ 15న మార్టగేజ్ లోన్ ( Mortgage loan ) కోసం సోనుసూద్ ( Sonu Sood ) దరఖాస్తు చేసుకున్నాడనేది సదరు మీడియా కథనాల సారాంశం.

Also read : Sonu Sood: ఆచార్య సెట్స్‌లో రియల్ హీరో సోనూసూద్‌కు సత్కారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News