Sohel Lucky Lakshman : లక్కీ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నాటి విషయాలపై సోహైల్ ఎమోషనల్

Sohel Bigg Boss Prize money సోహైల్ బిగ్ బాస్ షోతో అందరికీ చేరువయ్యాడు. బిగ్ బాస్ చివర్లో డబ్బులు పట్టుకెళ్లి రూ. 25 లక్షలు సంపాదించేశాడు. అయితే దీనిపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. దీనిపై ఇప్పుడు సోహైల్ క్లారిటీ ఇచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2022, 12:38 PM IST
  • ఈ వారం థియేటర్లోకి లక్కీ లక్ష్మణ్
  • బిగ్ బాస్ ప్రైజ్ మనీపై సోహైల్
  • ట్రోలర్లపై సోహైల్ ఎమోషనల్ కామెంట్స్
Sohel Lucky Lakshman : లక్కీ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నాటి విషయాలపై సోహైల్ ఎమోషనల్

Sohel Bigg Boss Prize money సోహైల్ బిగ్ బాస్ షో కంటే ముందే ఇండస్ట్రీలో ఉన్నాడు. సీరియల్స్‌లో నటించాడు. కొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు పోషించాడు. కానీ బిగ్ బాస్ షోతో సోహైల్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. రన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ మెహబూబ్ ఇచ్చిన చేతి సైగల హింట్‌తో డబ్బుల సూట్ కేస్ పట్టుకుని బయటకు వచ్చాడనే టాక్ అప్పట్లో మార్మోగిపోయింది. అయితే దానిపై మరోసారి సోహెల్ స్పందించాడు. తన లక్కీ లక్ష్మణ్ సినిమా డిసెంబర్ 30న విడుదల కాబోతోన్న సందర్భంగా బుధవారం నాడు ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు.

ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత  గోగినేని ఈ సినిమాను నిర్మించారు. బుధవారం గ్రాండ్‌గా ఏర్పాటు చేసిన ఈవెంట్లో సినిమా యూనిట్‌తో పాటుగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్, ఆర్పీ పట్నాయక్, సాయి రాజేష్ వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సినిమా ఈవెంట్లోనే కొరమీను సినిమా హీరో, హీరోయిన్లు సైతం పాల్గొన్నారు. ఇక సోహైల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఫుల్ అగ్రెసివ్ అయ్యాడు.

తనను ప్రతీసారి బిగ్ బాస్ ప్రైజ్ మనీ విషయంలో ట్రోల్స్ చేస్తుంటారని, తాను ఎవరి డబ్బులు కాజేయలని, మీ ఇంట్లోని డబ్బులను తీసుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ టీం ఆఫర్ చేసింది.. నేను తీసుకున్నాను.. అయినా ఆ డబ్బుతో మా సిస్టర్ పెళ్లి చేశాను.. మీరు వేసిన ఓట్లు, వాటి ద్వారా వచ్చిన డబ్బేమీ వృథా కాలేదు.. ఓ ఆడపిల్ల పెళ్లి చేయడం కంటే ఇంకేం కావాలి అంటూ ఇలా ఎమోషనల్ అయ్యాడు సోహైల్.

తాను ఇంత వరకు సొంతింటిని కట్టుకోలేదని, వచ్చిన డబ్బులో కొంత సాయం చేయడం మాత్రమే తనకు తెలుసని అన్నాడు సోహైల్. తన మీద ట్రోలింగ్ చేసినా పర్లేదు గానీ.. ఇంట్లోని వాళ్లను తిడితే మాత్రం ఊరుకోనని, అడ్రస్ కనుక్కుని మరీ వచ్చి ఉరికిచ్చి కొడతాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు.నన్నే కాదు.. ఏ సెలెబ్రిటీ పర్సనల్ విషయాల మీద నెగెటివ్ కామెంట్ చేయొద్దని, సినిమాల వరకు మీ ఇష్టం ఉన్నట్టుగా అనండి కానీ కుటుంబ సభ్యులను మాత్రం తిట్టొద్దని వార్నింగ్ ఇస్తూనే వేడుకున్నాడు సోహైల్. తనను నమ్మి సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చిన తన భార్య, నిర్మాత హరితకు డైరెక్టర్ హరి థాంక్స్ చెప్పాడు. తెలుగు ప్రజల మీదున్న నమ్మకంతోనే ఈ సినిమాను థియేటర్లోకి రిలీజ్ చేస్తున్నామని నిర్మాత హరిత అన్నారు.

Also Read : Anchor Suma Quits Mallemala : బుల్లితెరకు దూరం కాబోతోన్న సుమ.. రూమర్లపై వీడియో.. ఆపై వెంటనే డిలీట్

Also Read : Pawan Kalyan Marriages : పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ స్పందన.. కుక్కలే అంటూ బాలయ్య కౌంటర్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News