Home remedies for back pain :
లైఫ్ స్టైల్ సరిగ్గా లేక ఎముకుల ఆరోగ్యం దెబ్బతినే వారు ఎందరో ఉన్నారు. మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారు అలాగే ఎక్కువసేపు కూర్చొని లేక నిలుచొని పని చేయాల్సి వచ్చిన వారు వెన్నెముక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఇలా జరగడం వల్ల క్రమేపి వయసు పెరిగే కొద్దీ అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మొదటి నుంచి మనం మన ఎముకల బలం పై దృష్టి పెట్టాలి.
మన శరీరంలో వెన్నెముక అనేది నరాలకు ఒక పెద్ద సపోర్టు లాంటిది. కాస్త ఎస్ ఆకారంలో వంగి వంపుతో ఉండే ఈ వెన్నెముక మెడ, ఛాతి, వీపు ,పొత్తికడుపు అన్నిటినీ కలుపుతూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ భాగం శరీరంలోని ఎన్నో అవయవాలకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
చాలామంది తమకు తెలియకుండానే అధిక బరువు లేక ఉబకాయంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారి బరువు కారణంగా వెన్నెముక స్ట్రెస్ కి గురి అవుతుంది. దీనివల్ల ఒత్తిడి పెరిగి నడుము నొప్పి ,వెన్నుపూస నొప్పి తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి. ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారికి కూడా క్రమేపి వెన్ను వ్యవస్థ దెబ్బతింటుంది. మీకు తరచుగా వెన్నునొప్పి వస్తూ ఉంటే రెడ్ మీట్, రిఫైన్డ్ షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం తగ్గించాలి.
మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటూ కొవ్వు శాతం తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తాజా కూరగాయలు పండ్లు ఆకుకూరలు మీ రోజువారి డైట్ లో భాగంగా చేసుకోవాలి. మీరు ఎక్కువ సేపు కూర్చొని పనిచేయాల్సి వచ్చినప్పుడు పైకి లేచి నడవడం ,బ్రేక్ టైం లో స్ట్రెచింగ్ ఎక్ససైజ్ చేయడం ఎంతో మంచిది. రోజువారి యోగా చేసేవారికి వెన్నెముక, బలంగా దృఢంగా ఉంటుంది. రెగ్యులర్గా భుజంగాసనం , తాడాసనం వంటి ఆసనాలు వేయడం వల్ల మీ శరీరంలో తలెత్తే పలు రకాల నొప్పులు తగ్గడమే కాకుండా మీరు ఎంతో ఫిట్ గా ఉంటారు.
గమనిక:
పై సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. ఏదైనా పాటించే ముందు ఒకసారి మీ డాక్టర్ను సంప్రదించడం మంచిది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..