SJ Surya Comments on Mahesh Babu's Movie: ఇప్పటికీ నాకు ఆ బాధ ఉంది.. మహేష్‌ బాబు నటించిన నాని సినిమాపై ఎస్ జే సూర్య కామెంట్స్

Mahesh Babu Nani Disaster మహేష్‌ బాబు నాని సినిమా రిజల్ట్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడంపై తాజాగా ఎస్ జే సూర్య మాట్లాడాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 03:54 PM IST
  • నెట్టింట్లో ఎస్ జే సూర్య కామెంట్స్ వైరల్
  • రామ్ చరణ్‌ శంకర్ ప్రాజెక్ట్ మీద ఓపెన్
  • మహేష్‌ బాబు నాని డిజాస్టర్‌పై ఎస్ జే సూర్య
SJ Surya Comments on Mahesh Babu's Movie: ఇప్పటికీ నాకు ఆ బాధ ఉంది.. మహేష్‌ బాబు నటించిన నాని సినిమాపై ఎస్ జే సూర్య కామెంట్స్

SJ Surya Comments on Mahesh Babu's Nani Disaster : మహేష్ బాబు తన కెరీర్‌లో చాలానే ప్రయోగాలు చేశాడు. కొన్ని సార్లు అవి వర్కౌట్ అయ్యాయి. ఇంకొన్ని సార్లు బెడిసి కొట్టాయి. అయితే మహేష్‌ బాబు తమిళ దర్శకులతో చేసిన ప్రతీ సారి పెద్ద దెబ్బే పడిపోయింది. మహేష్‌ బాబు ఎస్ జే సూర్యతో కలిసి చేసిన నాని సినిమా దారుణంగా బోల్తా కొట్టేసింది. మహేష్‌ బాబు మురుగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్‌ సినిమా డిజాస్టర్లకే డిజాస్టర్‌గా మిగిలింది. అలా మహేష్‌ బాబుకు కోలీవుడ్ డైరెక్టర్లతో మరుపురాని చిత్రాలు పడ్డాయి.

మురుగుదాస్ సైతం స్పైడర్ సినిమా ఫలితం పట్ల కాస్త బాధపడ్డాడు. ఎలాగైనా సరే మహేష్‌ బాబుకు మంచి హిట్ ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా చెప్పాడు. తాజాగా ఎస్ జే సూర్య కూడా అలానే అన్నాడు. నాని సినిమా విషయంలో తనకు ఎప్పటి నుంచో ఓ బాధ మిగిలిపోయిందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు నాని గురించి ఎస్ జే సూర్య మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

 

'ఒక పెద్ద హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ దర్శకుడిని అయ్యాను. ప్రతీ సినిమాను ప్రేమతోనే చేస్తాం.. మన శక్తినంతా ధారపోస్తాం. కానీ ఈ చిత్రంలో తప్పు జరిగింది.. ఈ సినిమాలో తప్పులు జరిగినప్పుడు.. మీరు మనస్పూర్తిగా సినిమా చేశారు అది నాకు తెలుసు అని మహేష్ బాబు గారు నాతో అన్నారు.. పవన్ కళ్యాణ్ గారికి హిట్ ఇచ్చాను.. కానీ మహేష్ బాబు గారికి హిట్ ఇవ్వలేదు. దేవుడు నాకు భవిష్యత్తులో అవకాశం ఇస్తారు.. ఇప్పుడు నేను యాక్టింగ్‌లో బిజీగా ఉన్నాను.. నటించే పిచ్చి తగ్గిన తరువాత.. నేను సినిమాలు తీస్తాను. అప్పుడు నేను మహేష్‌ బాబు గారితోనే సినిమా చేస్తాను.. ఆయన్ను ఒప్పిస్తాను' అని ఎస్ జే సూర్య అన్నాడు.

Also Read : Love Today Day 1 Collections : అల్లరి నరేష్‌ను తొక్కి అవతల పారేసిన తమిళ డబ్బింగ్ సినిమా.. లవ్ టుడేకు దిమ్మ తిరిగే కలెక్షన్లు

Also Read : Vikram Gokhale Death : ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే మరణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News