Mrunal Thakur: ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఈ బ్యూటీ ఎంపికైంది. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడు నాని, విజయదేవర కొండ చిత్రాల్లో నటిస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2023, 10:53 AM IST
Mrunal Thakur: ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: సీరియల్‌ నటిగా కెరీర్‌ ప్రారంభించి.. 'విట్టి దండు’'అనే మరాఠి చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్‌ ఠాకూర్‌. తర్వాత హిందీలో ‘లవ్‌ సోనియా, ‘సూపర్‌ 30’, జెర్సీ(హిందీ) వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన  బాట్లా హౌజ్‌, ఘోస్ట్‌ స్టోరిస్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతాయి. తెలుగులో ఈ బ్యూటీ నటించిన సీతారామం ఆమె కెరీర్ కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. 'సీతారామం' సినిమాతో నేషనల్ వైడ్ గా క్రష్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నాని సరసన 'హాయ్ నాన్న' అనే చిత్రంలో నటిస్తోంది. అంతేకాకుండా ఈ బ్యూటీ చేతిలో మరో మూడు చిత్రాలు కూడా ఉన్నాయి 

తాజాగా మృణాల్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది.  త్వరలో ఆస్ట్రేలియాలో జరుగనున్న ‘'ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌'’లో డైవర్సిటీ ఇన్‌ సినిమా అవార్డుకు ఈ బ్యూటీ ఎంపికైంది. భిన్న భారతీయ భాషల్లో ప్రశంసాత్మక పాత్రల ద్వారా మృణాల్‌ ఠాకూర్‌ అడియెన్స్ ను మెప్పించిందని అవార్డుల కమిటీ పేర్కొంది.  ఈ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని.. భవిష్యత్తులో మరిన్ని స్ఫూర్తివంతమైన పాత్రల్లో నటించడానికి ఈ పురస్కారం ప్రేరణనిస్తుందని మృణాల్‌ ఠాకూర్‌ తెలిపింది. 

ఇటీవల 'హాయ్ నాన్న' (Hi Nanna Movie) చిత్రం నుంచి మృణాల్ ఠాకూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. గిటారు బ్యాక్‌ వేసుకుని ఉన్న మృణాళ్‌ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ  సినిమాలో మృణాళ్‌ గిటార్‌ నేర్పించే టీచర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న 'హాయ్ నాన్న' సినిమాను వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నాడు. అబ్దుల్‌ హేషమ్ వాహబ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

Also Read: TOBY Movie: ఆసక్తి రేపుతున్న 'టోబి' ట్రైలర్.. మీరు ఓ లుక్కేయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News