Singer Revanth Engagement: ఘనంగా సింగర్ రేవంత్ నిశ్చితార్థం, ఫోటోలు వైరల్

Singer Revanth Engagement: టాలెంటెడ్ సింగర్ రేవంత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా రేవంత్ నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 09:24 PM IST
Singer Revanth Engagement: ఘనంగా సింగర్ రేవంత్ నిశ్చితార్థం, ఫోటోలు వైరల్

Singer Revanth Engagement: ఇండియన్ ఐడల్ విజేత, ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ నిశ్చితార్థం (Singer Revanth Engagement) గుంటూరులో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ ఘనంగా నిర్వహించారు. రేవంత్ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ గా మారాయి. 

అద్భుతమైన గాత్రంతో తెలుగులో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చున్నాడు రేవంత్. బాహుబలి పార్ట్‌-1లో మనోహరి పాట (Manohari song)తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.తాజాగా రేవంత్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రేవంత్ అసలు పూర్తి పేరు.. లోల వెంకట రేవంత్ కుమార్ శర్మ. శ్రీకాకుళం అతని స్వస్థలం. విశాఖపట్నంలోని డాక్టర్. వి.ఎస్.కృష్ణా గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసాడు. 

Also Read: FIR on Karate Kalyani: నటి కరాటే కళ్యాణి‌పై జగద్గరిగుట్ట పోలీసుల కేసు నమోదు!

త్వరలోనే బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు రేవంత్. డిసెంబర్‌24న అన్విత అనే అమ్మాయితో రేవంత్‌ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో షేర్‌ చేశాడు ఈ సింగర్. దీంతో పలువురు నెటిజన్లు రేవంత్‌కు బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రేవంత్‌కి కాబోయే భార్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News