Rahul Sipligunj: రతిక రోజ్‌తో పర్సనల్ పిక్స్‌పై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్.. గుట్టురట్టు చేసేశాడు..!

Rahul Sipligunj Rathika Rose Breakup: రతిక రోజ్‌తో బ్రేకప్‌ విషయంపో ఇండెరైక్ట్‌గా రియాక్ట్ అయ్యాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఆమెలో లోపల ఉన్నప్పుడు మొబైల్‌లో ఉన్న పర్సనల్ పిక్స్‌ను ఎలా బయటకు వస్తున్నాయి..? అని అడిగాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 21, 2023, 09:19 AM IST
Rahul Sipligunj: రతిక రోజ్‌తో పర్సనల్ పిక్స్‌పై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్.. గుట్టురట్టు చేసేశాడు..!

Rahul Sipligunj Rathika Rose Breakup: బిగ్ బాస్ సీజన్‌ 7లో ఉన్న హౌస్‌మెట్స్‌లో ఉన్న రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. హౌస్‌లో రతిక ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తనతో క్లోజ్‌గా ఉండే వాళ్లకే వెన్నుపోటు పొడుస్తూ.. బయట మాత్రం బాగా నెగివిటీని తెచ్చుకుంటోంది. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ఇద్దరు రతిక రోజ్ బాధితులుగా మారారు. ఎప్పటికప్పుడు ప్లేట్ ఫిరాయిస్తూ.. కంటెస్టంట్లకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఆఫ్‌కోర్స్ అది ఆమె గ్లేమ్ ప్లాన్ కావచ్చు. ఇక అసలు విషయంలోకి వస్తే.. రతిక రోజ్ బిగ్‌బాస్‌లోకి వచ్చే కొద్ది రోజుల ముందు నెట్టింట పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ అంట.. బిగ్‌బాస్‌లోకి వెళుతుందట అంటూ ముందు రూమర్లు వచ్చాయి. అప్పుడే రాహుల్-రతిక కొన్ని పిక్స్ వైరల్ అయ్యాయి. ఇక ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత రాహుల్ సిప్లిగంజ్‌తో రతిక దిగిన పర్సనల్ పిక్స్‌ ఇంకాస్త ఎక్కువగా బయటకు వస్తున్నాయి. సరిగ్గా రతిక హౌస్‌లో ఉన్నప్పుడే ఈ ఫొటోలు ఎందుకు బయటకు వస్తున్నాయి..? అని చాలా మంది అనుకుంటున్నారు. రతిక రోజ్‌తో రాహుల్ ఎప్పుడో బ్రేక్‌ చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో బూస్ట్ కోసమే ఈ పిక్స్‌ను పీఆర్ టీమ్ లీక్ చేసి వైరల్ చేస్తోందా..? తాజాగా ఈ పిక్స్‌పై రాహుల్ సిప్లిగంజ్ పరోక్షంగా రియాక్ట్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు. 

ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటి వరకు..? అని రాహుల్ ప్రశ్నించాడు. ఎవరైనా ఎల్లప్పుడు తమ ఒరిజనల్‌ టాలెంట్‌ను బయటపెట్టాలని చూస్తారని.. కానీ కొందరు మాత్రం ఇతరుల టాలెంట్, వారి పేరు మీద ఆధారపడి బతకాలని చూస్తుంటారని అన్నాడు. తమ ఫేమ్ కోసం పేరుని అవసరాని కన్నా ఎక్కువ వాడుకుంటున్నారని పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. లోపల ఉన్న పర్సన్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. పైసల్ తీసుకుని పని చేస్తున్న ఆమె టీమ్‌కు కంగ్రాట్స్ అంటూ స్టోరీలో రాసుకొచ్చాడు.

ఈ సందర్భంగా తనకు ఓ సందేహం ఉందన్నాడు రాహుల్. తనదొక ప్రశ్న అని.. ఆరేళ్ల తరువాత ఆమె పర్సనల్ ఫోన్‌లో ఉన్న పిక్స్ ఇంటర్నెట్‌లోకి ఎలా వచ్చాయి..? అని అడిగాడు. లోపలకు వెళ్లే ముందే ప్లాన్ లీక్ చేయాలని ప్లాన్ చేసుకున్నారా..? మీరే ఒకసారి ఆలోచించుకోవాలని అభిమానులను కోరాడు. మీకే అర్థం అవుతుందని.. తాను ఏ అమ్మాయి జీవితంతోగానీ.. ఇతరుల జీవితాలతో ఆడుకోలేదని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరు తమ సక్సెస్ కోసం వాళ్లు  కష్ట పడుతుంటారని అన్నాడు. ఇలాంటి పనులు చేసే ముందు ఒకసారి ఆలోచించాల్సిందని చెప్పాడు. ప్రతి ఒక్కరికీ గతం ఉంటుందని.. ఏమి తెలియకుండా జడ్జ్ చేయకండంటూ ట్రోలర్స్ గట్టిగా సమాధానం చెప్పాడు. తనను అర్థం చేసుకునేవాళ్లకు థ్యాంక్స్ చెప్పిన రాహుల్ సిప్లిగంజ్.. నెగిటివ్ స్ప్రెడ్ చేయాలనుకునే వారికి ఆల్ ది బెస్ట్  చెప్పాడు. పరోక్షంగా రతిక రోజ్ గురించి చెబుతూ.. గుట్టురట్టు చేశాడు ఈ స్టార్ సింగర్.

ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న రతిక.. అవసరమైన సందర్భంలో రాహుల్ పేరును ఇండైరెక్ట్‌గా వాడేస్తోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ముందు నాగార్జునతో చేసిందంతా చేసి.. ఇప్పుడు నవ్వుకుంటున్నారని చెప్పింది. హౌస్‌లో లోపల నీకు ఎలాంటి అబ్బాయి కావాలని బిగ్‌బాస్ అడగ్గా.. తన ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండాలంటూ చెప్పుకొచ్చింది. ఆ పర్సన్‌ను చాలా మిస్ అవుతున్నట్లు చెప్పింది.

Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ   

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News