Singer Lipsika Dub For Adipurush ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ ఎంతటి ట్రోలింగ్‌కు గురైందో అందరికీ తెలిసిందే. అయోధ్యలో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించి ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ మీద దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ఆ ట్రోలింగ్‌ను కవర్ చేసేందుకు చాలా మంది చాలా రకాలుగా ట్రై చేశారు. ఇది మొబైల్‌లో చూసే సినిమా కాదని, త్రీడీలో థియేటర్లో చూడాలంటూ ఓం రౌత్ హితవు పలికాడు. ఇక టీజర్ మీద వచ్చిన విమర్శలను తిప్పి కొట్టాలని రిపేరింగ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
అందుకే ఆదిపురుష్ ఆలస్యం అవుతూనే వచ్చింది. ఇంకో వంద కోట్లు కేటాయించి.. వీఎఫ్‌ఎక్స్ పనులను చేయించినట్టుగా టాక్ వచ్చింది. ఎట్టకేలకు ఇన్ని వాయిదాల తరువాత ఆదిపురుష్ జూన్ 16న రాబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పెంచేశారు. నేడు ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. నిన్న ఏఎంబీ మాల్‌లో స్పెషల్‌గా స్క్రీనింగ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ వంటి వారు వచ్చారు.
ఇక నేడు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబైలో నిర్వహించారు. అక్కడ ప్రభాస్ సందడి చేశాడు. అయితే ఈ ట్రైలర్ మాత్రం అందరి అంచనాలకు మించే ఉంది. టీజర్‌తో ఆదిపురుష్ మీద అంచనాలు లేకుండాపోయాయి. ఆ తరువాత మెల్లిమెల్లిగా హైప్ పెరిగింది. పోస్టర్లతోనే క్రేజ్ పెంచేసింది ఆదిపురుష్ టీం. జై శ్రీరామ్ అంటూ వదిలిన పాట, అందులోని మంత్రంతో ఒక్కసారిగా ఆదిపురుష్ అంచనాలు ఆకాశన్నంటాయి.
Also Read: Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్
అయితే ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలర్‌లో ప్రభాస్ లుక్, కృతి సనన్ పర్పామెన్స్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ అప్పియరెన్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో సీత పాత్రకు సింగర్ లిప్సిక డబ్బింగ్ చెప్పింది. ఇలాంటి ప్రాజెక్టులకు పని చేయడం ఆనందంగా ఉంటుందని లిప్సిక చెప్పుకొచ్చింది. తాను డబ్బింగ్ చెప్పిన పాత్రలను, ఆ డైలాగ్‌లను టీవీలో చూసుకుని లిప్సిక మురిసిపోయింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా లిప్సికకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook