Prabhas Salaar Shooting : సలార్ సెట్‌లో శ్రుతి హాసన్.. ఎంతో లక్కీ అంటూ పోస్ట్

Prabhas Prashanth Neel Salaar Set ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుందట.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 08:26 PM IST
  • సలార్ షూటింగ్ అప్డేట్ వచ్చేసినట్టేనా?
  • సెట్‌లో అడుగు పెట్టిన శ్రుతి హాసన్
  • ప్రశాంత్ నీల్‌ గురించి హీరోయిన్ పోస్ట్
Prabhas Salaar Shooting : సలార్ సెట్‌లో శ్రుతి హాసన్.. ఎంతో లక్కీ అంటూ పోస్ట్

Prabhas Prashanth Neel Salaar Set ప్రభాస్‌కు అనారోగ్యం అని, షూటింగ్‌లు అన్నీ క్యాన్సిల్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభాస్‌ క్షేమంగానే ఉన్నాడని అర్థమైంది. ఆల్రెడీ షూటింగ్ సెట్‌లోకి వచ్చినట్టుగా కూడా అర్థం అవుతోంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ నిన్న స్టార్ట్ అయినట్టుగా ఉంది. సలార్ సెట్‌లో అడుగుపెట్టాను అంటూ శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కెమెరామెన్ భువన గౌడలతో పని చేయడం ఆనందం, అదృష్టం అని తెలిపింది.

సలార్ సినిమా మీద రకరకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంత వరకు ప్రశాంత్ నీల్ గానీ, నిర్మాణ సంస్థ గానీ స్పందించలేదు. ఇక ఇది ఉగ్రం రీమేక్ అని ఒకప్పుడు టాక్ వినిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గతంలో ఈ కామెంట్లు చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు సలార్ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందనే టాక్ వచ్చింది. ప్రభాస్‌కు జ్వరం రావడంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేశారని అన్నారు. కానీ ఇప్పుడు సలార్ సెట్స్ మీదకు వచ్చింది. కొత్త షెడ్యూల్‌లో శ్రుతి హాసన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు శ్రుతి హాసన్ ఓ పోస్ట్ వేసింది.

కెమెరామెన్ భువన గౌడ, డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌లు దొరకడం, వారితో పని చేయడం నిజంగా తన అదృష్టం అంటూ శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇక శ్రుతి హాసన్ ఇప్పుడు లక్కీ హీరోయిన్‌గా మారింది. సంక్రాంతి బరిలోకి దిగిన రెండు సినిమాలు కూడా హిట్ అయ్యాయి.

చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. బాలయ్య వీర సింహా రెడ్డి హిట్టుగా నిలిచింది. ఈ రెండు సినిమాల్లోనూ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. వీరయ్య సినిమాలో చేసిన పాత్రకు మంచి అప్లాజ్ రాగా.. వీర సింహా రెడ్డి సినిమాలోని కారెక్టర్‌కు నెగెటివ్ ఇమేజ్ వచ్చింది.

Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే

Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News