Shriya Saran lip lock : ఇది కామన్ ఏముంది అందులో.. బహిరంగంగా లిప్ లాక్ ట్రోలింగ్‌పై శ్రియా రియాక్షన్

Andrei Koscheev lip lock శ్రియా, ఆండ్రూల రొమాన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముందు ఎవరున్నారు.. మనం ఏ స్టేజ్ మీదున్నాం.. ఏ స్థానంలో ఉన్నామ్ అనేది చూడకుండా రొమాన్స్‌తో రెచ్చిపోతోంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 08:30 AM IST
  • బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా దృశ్యం 2
  • సక్సెస్ మీట్‌లో శ్రియా, ఆండ్రూల రచ్చ
  • లిప్ లాక్ ట్రోలింగ్‌పై శ్రియా రియాక్షన్
Shriya Saran lip lock : ఇది కామన్ ఏముంది అందులో.. బహిరంగంగా లిప్ లాక్ ట్రోలింగ్‌పై శ్రియా రియాక్షన్

Shriya Saran Andrei Koscheev lip lock : శ్రియ తన భర్త ఆండ్రూతో కలిసి చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో అయితే మరింతగా రెచ్చిపోతోంటారు. లిప్‌ లాక్స్ అనేవి ఈ జంటకు కామన్. వారు ఎక్కడున్నారు అనేది పట్టించుకోరు. నడిరోడ్డు మీదున్నా, ఇంట్లో ఉన్నా కూడా ముద్దులు మాత్రం కామన్‌గా ఉంటాయి. లిప్ లాక్స్‌తో ఆండ్రూ రెచ్చిపోతోంటాడు. ఇక శ్రియా సైతం ముద్దులతో సందడి చేస్తుంటుంది.

తాజాగా దృశ్యం 2 సక్సెస్ మీట్‌లోనూ అలానే జరిగింది. శ్రియాకు ఆండ్రూ లిప్ లాక్ పెట్టేశాడు. దీనిపై ట్రోలింగ్ జరిగింది. దీంతో శ్రియా ట్రోలింగ్ మీద రియాక్ట్ అయింది. ఇది చాలా మామూలు విషయం. నా ఈ ప్రత్యేక మూమెంట్‌లో ఇలా కిస్ చేయడం ఆండ్రూ సాధారణ విషయమే అనుకున్నాడు.. నాకు కూడా అది నచ్చింది.. ఇలా నార్మల్ విషయానికి కూడా మీరంతా ఎందుకు ట్రోల్ చేస్తున్నారా? అనేది నా భర్తకు అర్దం కాలేదు.. సరే అది మీ ఇష్టం.. నేను చెత్త కామెంట్లను  చదవను.. పట్టించుకోను.. అలా రాయడం, మాట్లాడటం వాళ్ల పని.. దాన్ని పట్టించుకోకపోవడం నా పని.. నేనేం చేయాలో అదే చేస్తాను అని కౌంటర్ వేసింది.

మామూలుగానే శ్రియ, ఆండ్రూలు ఫారిన్ కంట్రీలో రచ్చ రచ్చ చేస్తుంటారు. పైగా ఆండ్రూ ఓ రష్యన్. అక్కడ ఇలాంటివన్నీ వారికి కామన్. బహిరంగ ప్రదేశాల్లోనే లిప్ లాక్స్ పెట్టుకుంటారు. శృంగారం చేసుకుంటూ ఉంటారు. కరోనా సమయంలో ఈ ఇద్దరూ షేర్ చేసిన వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ఇప్పుడు లిప్ లాక్ మీద జరిగిన ట్రోలింగ్ మీద మాత్రం శ్రియా ఇలా ఘాటుగా స్పందించింది.

దృశ్యం 2 సినిమా ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరినిచ్చింది. గత కొన్ని నెలలుగా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి. కానీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. వంద కోట్లు, రెండు వందల కోట్లు అంటూ టార్గెట్ పెంచేసుకుంటూ పోతోంది. మలయాళం, తెలుగు వర్షెన్లు ఓటీటీలో రాగా.. హిందీ వర్షెన్ మాత్రం థియేటర్లో సందడి చేస్తోంది.

Also Read : Kamal Haasan Health : కమల్ హాసన్‌కు అస్వస్థత.. నిన్ననే అలా ఇప్పుడు ఇలా

Also Read : Raai Laxmi Bikini Pics : బికినీలో రత్తాలు.. రాయ్ లక్ష్మీ అందాల విందు.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News