Bigg Boss 15: హాట్ టాఫిక్ గా సల్మాన్ రెమ్యూనరేషన్‌..బిగ్‌బాస్ 15 సీజన్‌ కోసం రూ.350 కోట్లా...!

Salman Khan: హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌కు హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. దాదాపు 14 వారాలపాటు కొనసాగే ఈ కార్యక్రమం కోసం షో నిర్వాహకులు సల్మాన్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2021, 01:48 PM IST
Bigg Boss 15: హాట్ టాఫిక్ గా సల్మాన్ రెమ్యూనరేషన్‌..బిగ్‌బాస్ 15 సీజన్‌ కోసం రూ.350 కోట్లా...!

Bigg Boss 15 Salman Khan Remuneration: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు ప్రేక్షకుల్లో అత్యంత ప్రజాదరణ ఉంది. హిందీ బిగ్‌బాస్‌ 15(bigg boss 15)వ సీజన్‌కు రెడీ అవుతోంది. ఇప్పటివరకు పూర్తయిన 14 సీజన్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ 15వ సీజన్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ ఇప్పడు వైరల్ గా మారింది. 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌(Salman Khan) ఈ బిగ్ బాస్ షోకు 11 సీజన్ల పాటు హోస్ట్ గా వ్యవహారించారు.  విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా హిందీలో మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ క్రమంలో ప్రతి ఏడాది మాదిరిగానే సల్మాన్‌ తన రెమ్యునరేషన్‌ పెంచినట్లు సినీ ఇండస్ట్రీలో చర్చనడుస్తోంది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ 15 సీజన్‌లో సల్మాన్‌ రెమ్యునరేషన్ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. త్వరలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ సీజన్ 15కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షో కోసం సల్మాన్‌ కళ్లు చెదిరే పారితోషకం(remuneration) అందుకోబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Also Read: Bhavai movie controversy: హీరో ప్రతీక్ గాంధీని అరెస్ట్ చేయాలంటున్న నెటిజన్స్! కారణం ఏంటంటే..

సల్మాన్ ఖాన్ 15వ సీజన్‌లోని ఒక్కో ఎసిపోడ్‌కు సల్మాన్ ఖాన్.. రూ. 16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు బాలీవుడ్(Bollywood) వర్గాలు పేర్కొంటున్నారు. అలా14 వారాల‌కు గాను 350 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేయనున్నట్లు స‌మాచారం. అంటే ప్రతీ వారానికి దాదాపు 25 కోట్లు వ‌సూలు చేయనున్నట్లు తెలుస్తుంది. గతేడాదికి ఇప్పటికీ.. దాదాపు రెమ్యునరేషన్‌(remuneration) డబుల్‌ చేసినట్లు పేర్కొంటున్నారు. కాగా.. సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) సినిమాలో నటిస్తే.. దాదాపు రూ. 50 కోట్లకుపైగా పారితోషికం అందుకుంటారు. 100రోజుల బిగ్‌బాస్(Bigg Boss) వంటి రియాలిటీ షో ద్వారా పెద్ద మొత్తంలో క్యాష్ చేసుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News