Krishnamma: ఓటీటీలో ట్రెండ్ సెట్ చేస్తున్న కృష్ణ‌మ్మ‌.. దూసుకుపోతున్న సత్యదేవ్ సినిమా

Krishnamma OTT: వైవిద్యమైన సినిమాలు చేయడంలో సత్యదేవ్ ఎప్పుడు ముందుంటారు. ఈ క్రమంలో ఈ మధ్యనే ఈ హీరో కృష్ణమ్మ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థియేటర్స్ లో పరవాలేదు అనిపించుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సైతం హవా చూపిస్తోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 29, 2024, 05:12 PM IST
Krishnamma: ఓటీటీలో ట్రెండ్ సెట్ చేస్తున్న కృష్ణ‌మ్మ‌.. దూసుకుపోతున్న సత్యదేవ్ సినిమా

Krishnamma OTT: వైవిధ్యమైన చిత్రాలలో నటించడంలో హీరో సత్యదేవ్ ఎప్పుడు ముందుంటారు. రోటీన్ కథలు కాకుండా ఎప్పుడూ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారు ఈ హీరో. అలా ఈ హీరో డిఫరెంట్ గా ట్రై చేసిన సినిమా నే ఈ మధ్య వచ్చిన క్రిష్ణమ్మ. ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ సినిమాలో కృష్ణ బూరుగుల‌, ల‌క్ష్మ‌ణ్ మీసాల‌, నంద గోపాల్‌, హ‌రిబాబు కీల‌క పాత్ర‌ల్లో కనిపించి నొప్పించారు. కాగా ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో 240దేశాల‌కు పైగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

అమెజాన్ ప్రైమ్ లో ఈ మధ్య విడుదలైన సినిమాలలో.. ఎక్కువ వ్యూస్ సంపాదించుకున్న చిత్రాలలో ఈ సినిమా ఒకటిగా మిగిలింది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసి అభినందిస్తున్నారు. ముఖ్యంగా సత్యదేవ్ యాక్టింగ్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నాడు.

కాగా ఈ సినిమా కథ విషయానికి వస్తే కృష్ణా న‌ది ఒడ్డున ఉండే విజ‌య‌వాడ ప‌ట్టణంలో ముగ్గురు అనాథ‌లు శివ(కృష్ణ‌), భ‌ద్ర (స‌త్య‌దేవ్‌), కోటి (ల‌క్ష్మ‌ణ్ మీసాల‌) పెరిగి పెద్ద‌వుతారు. వీరి  ముగ్గురి మ‌ధ్య చ‌క్క‌టి అనుబంధం ఉంటుంది. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాల్లో ఓ అనుకోని సంఘటనల వల్ల కొన్ని సమస్యలు వచ్చి పడుతాయి. కాగా చిన్న‌త‌నంలో జైలుకి వెళ్లిన శివ, అక్క‌డి నుంచి వ‌చ్చాక నిజాయ‌తీగా జీవితాన్ని వెల్ల‌దీయాల‌నుకుంటాడు. ముగ్గురి స్నేహితుల్లో భ‌ద్ర‌, కోటిల‌కు కొంచెం డ‌బ్బులు అవ‌స‌రం అవుతాయి. దాంతో వాళ్లు గంజాయి స్మ‌గ్లింగ్ చేయాల‌నుకుని పోలీసుల‌కు దొరికిపోతాడు. అదే స‌మ‌యంలో ఓ ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌ని చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతారు. దీని కార‌ణంగా వాళ్ల జీవితాల్లో ఊహించ‌ని మలుపులు ఎదుర‌వుతాయి. ఆ ప‌ర్యావ‌సానాల‌ను వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు.. చివ‌ర‌కు ఏమైంద‌నేదే కృష్ణ‌మ్మ సినిమా కథ.

 మే నెల‌లో థియేట‌ర్స్‌లో విడుద‌లైన ఈ చిత్రం.. అభిమానుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియా స‌హా దాదాపు 240కి పైగా దేశాల్లో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది. ప్రేక్ష‌కులు ఈ ర‌స్టిక్ అండ్ రా యాక్ష‌న్ ను అమెజాన్ ప్రైమ్ లో ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News