Saranga Dariya song meaning: సారంగ దరియా సాంగ్‌కి అర్థం ఏంటో చెప్పిన Suddala Ashok Teja

Saranga Dariya song meaning: సారంగ దరియా.. ఈ పదానికి అర్థం ఏంటి ? సారంగ దరియ అనే పాటకు ఉన్న అర్థం ఏంటి ? Saranga Dariya song వైరల్ అయిన తర్వాత చాలా మందికి కలుగుతున్న సందేహాలు ఇవి. తెలంగాణ బాషపై, తెలంగాణ యాస, మాండలికంపై పట్టున్న వారిలో కూడా కొంతమందికి ఈ పదాలకు అర్థం ఏంటో అంతు చిక్కలేదట.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2021, 10:31 PM IST
  • విడుదలైన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారిన Saranga Dariya song.
  • Saranga Dariya song meaning కోసం గూగుల్ చేస్తున్న నెటిజెన్స్.
  • సారంగ దరియ పాటకు అర్థాన్ని వివరించిన గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ.
Saranga Dariya song meaning: సారంగ దరియా సాంగ్‌కి అర్థం ఏంటో చెప్పిన Suddala Ashok Teja

Saranga Dariya song meaning: సారంగ దరియా.. ఈ పదానికి అర్థం ఏంటి ? సారంగ దరియ అనే పాటకు ఉన్న అర్థం ఏంటి ? Saranga Dariya song వైరల్ అయిన తర్వాత చాలా మందికి కలుగుతున్న సందేహాలు ఇవి. తెలంగాణ బాషపై, తెలంగాణ యాస, మాండలికంపై పట్టున్న వారిలో కూడా కొంతమందికి ఈ పదాలకు అర్థం ఏంటో అంతు చిక్కలేదట. సోషల్ మీడియాలో వైరల్ అయిన Saranga Dariya song కి వచ్చిన స్పందన చూసి ఆ గేయాన్ని రాసిన ప్రముఖ రచయిత, నేషనల్ అవార్డ్ గ్రహీత అయిన సుద్దాల అశోక్ తేజ తాను రాసిన ఆ పదాల వెనుకున్న అర్ధాన్ని, అంతరార్ధాన్ని వివరించారు.

Suddala Ashok Teja interview చూస్తే సారంగ దరియ అర్థం ఏంటో అర్థమవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు వాయించే ఓ వాయిద్యం (Musical instrument) పేరే ఈ సారంగి. సుద్దాల అశోక్ తేజ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వేణును ధరించినవాడు వేణుధరుడు అయినట్టుగానే సారంగిని ధరించినటువంటి యువతిని ముద్దుగా సారంగ దరియా అని వర్ణించినట్టు తెలిపారు. అంతేకాకుండా Saranga dariya song లో అటువంటి పదాలెన్నింటికో ఆయన అర్థాలను వివరించారు.    

Also read : Jathi Ratnalu Trailer: కడుపుబ్బా నవ్విస్తున్న జాతి రత్నాలు ట్రైలర్

Saranga Dariya song వైరల్ అవడంతో ఇప్పటివరకు Love story Movie పై ఉన్న అంచనాలు సైతం అంతకంటే రెట్టింపయ్యాయి. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తోన్న లవ్ స్టోరీ మూవీలో నాగచైతన్య సరసన సాయి పల్లవి జంటగా నటిస్తోంది. సారంగ దరియా పాటకు అంత పబ్లిసిటీ రావడానికి కారణం కూడా Actress Sai Pallavi ప్రతిభనే అని సుద్ధాల అశోక్ తేజ చెప్పుకొచ్చారు. Sekhar Kammula ఊహించుకున్న దృశ్యాన్ని తాము అందరం కలిసి మీ ముందుకు తీసుకొచ్చామని సుద్దాల అశోక్ తేజ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News