Nithya Menon: పెళ్లి చేసుకోమని వేధింపులు.. 30 ఫోన్లతో నరకం చూపించాడు.. నిత్య మీనన్ సంచలన ఆరోపణలు!

Santhosh Varkey Nithya Menon Marriage Issue:తెలుగు హీరోయిన్ నిత్య మీనన్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రకటించి కలకలం రేపాడు సంతోష్ వర్కీ అనే వ్యక్తి. అతని మీద నిత్య మీనన్ సంచలన ఆరోపణలు చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2022, 02:50 PM IST
Nithya Menon: పెళ్లి చేసుకోమని వేధింపులు.. 30 ఫోన్లతో నరకం చూపించాడు.. నిత్య మీనన్ సంచలన ఆరోపణలు!

Santhosh Varkey Nithya Menon Marriage Issue: అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ నటి నిత్యామీనన్ తర్వాత తెలుగులో అనేక సినిమాలు చేసి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే ఆమె కెరియర్లో పెద్దగా క్లిక్ అవ్వలేదని చెప్పాలి. ఈ మధ్యనే తెలుగులో మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న ఆమె తన జీవితానికి సంబంధించిన ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఆమె మలయాళ, తెలుగు, తమిళ సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆమె మలయాళంలో విజయ్ సేతుపతితో కలిసి నటించిన ఒక సినిమాలో నటించారు.

ప్రస్తుతం ఆ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఆమె వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సందర్భంగా ఆమె కేరళకు చెందిన సంతోష్ వర్కీ అనే వ్యక్తి తనను ఇబ్బందులు పెట్టినట్లు వెల్లడించారు. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆరాట్టు అనే సినిమాను డీకోడ్ చేసిన సంతోష్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించి వార్తల్లోకి ఎక్కాడని, అప్పటినుంచి అతను తన గురించి అనేక విషయాలు ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ తనను ఇబ్బంది పెడుతున్నాడని, ఒకరకంగా మానసికంగా వేధిస్తున్నాడని నిత్యామీనన్ వెల్లడించారు.

సంతోష్ వర్కీ మాటలు వినే వారు మూర్ఖులన్న ఆమె సంతోష్ వర్కీ తనను పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని, 30కి పైగా మొబైల్ నంబర్లతో కాల్ చేస్తూ చికాకు పెడుతున్నాడని అన్నారు. ఇక వాటిని బ్లాక్ చేయమని మా తల్లిదండ్రులకు చెప్పానని, అతను సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీతో పెళ్లి అనే విషయాన్నీ పదే పదే చెబుతూ వేధిస్తున్నాడని అనాన్రు. నేను అతనిని క్షమించానని, అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయమని చాలా మంది సలహా ఇచ్చినా, నేను ఫిర్యాదు చేయలేని అన్నారు. ఇక నిత్యా మీనన్ చేసిన ఆరోపణలపై సంతోష్ వర్కీ స్పందించారు.

30కి పైగా నంబర్ల నుంచి కాల్ చేసి చిత్రహింసలకు గురిచేశానని ఆమె ఆరోపించారని, అయితే ఒక్క వ్యక్తి తన పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు కొంటాడో తెలిసిన వారు ఇది తాను చేశానో లేదో ఊహించుకోవచ్చని అన్నారు. అంతే కాదు నిత్యా మీనన్ తల్లి ఆమెకు ఎవరితోనో నిశ్చితార్థం జరిగిందని చెప్పారు. అయితే ఆమెకు ఎవరితోనూ నిశ్చితార్థం జరగలేదని ఆమె తండ్రి చెప్పారని వారు అలా వేర్వేరుగా మాట్లాడటంతో నేను చాలా కంగారు పడ్డానని అన్నారు. అంతేకాక వారు నాపై లైంగిక వేధింపుల కేసు పెట్టబోతున్నారని తెలిసింది. అలాగే నాన్న చనిపోయిన తర్వాత ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా విధులు నిర్వహిస్తున్నాను. ఇది నాకు తెలిసి ఉంటే, నేను ఆమెతో ప్రేమలో పడి ఆమె చుట్టూ తిరిగేవాడిని కాదని చెప్పుకొచ్చారు. 

Read Also: Keerthy Suresh: పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైన కీర్తి.. వరుడు ఎవరో తెలుసా?

Read Also: Bimbisara: దుమ్మురేపిన బింబిసార.. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరువగా.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News