Drugs Case: బెంగుళూరులో 10 ఫ్లాట్లు.. అంగీకరించిన సంజన

కర్ణాటకలో ( Karnataka ) డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది.

Last Updated : Sep 12, 2020, 03:08 PM IST
    • కర్ణాటకలో డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది.
    • ఈ కేసులో వీఐపీలు, వీవీఐపీల పేర్లు బయటికి వస్తున్నాయి.
    • డ్రగ్స్ కేసులో ఇప్పటికే ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేదీతో పాటు సంజనాను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Drugs Case: బెంగుళూరులో 10 ఫ్లాట్లు.. అంగీకరించిన సంజన

కర్ణాటకలో ( Karnataka ) డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో వీఐపీలు (VIP ), వీవీఐపీల పేర్లు బయటికి వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటికే ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేదీతో ( Ragini Dwivedi ) పాటు సంజనాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. తాజాగా బెంగుళూరు జాయింట్ కమిషనర్ సందిప్ పాటిల్ వీరిని ప్రశ్నించినట్టు సమాచారం.

విచారణలో భాగంగా అధికారులు సంజనా, రాగిణిలపై ప్రశ్నల వర్షం కురిపించారు. డ్రగ్స్ (Drugs ) పార్టీలు ఎలా జరుగుతాయి వంటి ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. దాంతో పాటు ఈ పార్టీలోకి వచ్చే వీఐపీలు, రాజకీయ నాయకుల సంతానం పేర్లు వీరు వెల్లడించినట్టు సమాచారం.  దాంతో పోలీసులు వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఈ విషయంలో పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెబుతున్న తరుణంలో సంజనా ( Sanjana ) పలు కీలక విషయాలు వెల్లడించారు. బెంగుళూరులో తనకు 10 ఫ్లాట్స్ ఉన్నాయని తెలిపారు.  ఈ విషయాన్ని నోట్ చేసుకున్న పోలీసులు అందులోకి ఎవరు వచ్చి వెళ్తారు అనేది చెక్ చేస్తున్నారు. ఈ ఫ్లాట్స్ కు పలువురు సినీ తారలతో పాటు మ్యూజిక్ డైరక్టర్స్ కూడా వచ్చి వెళ్లినట్టు సమాచారం.

Trending News