Sandalwood Drugs Case: స్టార్ యాంకర్ కు మత్తు మరక.. ఛార్జిషీట్ లో 'అనుశ్రీ' పేరు

Anchor Anushree: కన్నడ నాట డ్రగ్స్ కేసులో మంగళూరు సీసీబీ పోలీసులు తాజాగా కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. కాగా, ఈ చార్జిషీట్లో ప్రముఖ యాంకర్, నటి అనుశ్రీ పేరును పేర్కొన్నారు. దీంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్లీ శాండల్ వుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2021, 05:14 PM IST
  • మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్
  • డ్రగ్స్ కేసులో యాంకర్‌ అనుశ్రీ
  • తాను తప్పూ చేయలేదని వెల్లడి
Sandalwood Drugs Case: స్టార్ యాంకర్ కు మత్తు మరక.. ఛార్జిషీట్ లో 'అనుశ్రీ' పేరు

Anchor Anushree: శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో ప్రముఖ అందాల యాంకర్, నటి అనుశ్రీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. మంగళూరు సీసీబీ పోలీసులు(Mangalore CCB Police) కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో ఆమె పేరును పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ రాకెట్‌(Sandalwood Drugs Rocket) బయటపడగా, అప్పట్లో ఆమెను విచారించిన సంగతి తెలిసిందే. ముఖ్య సమాచారాన్ని ఛార్జిషీట్లో(chargesheet) ప్రస్తావించారు. అనుశ్రీ డ్రగ్స్‌(Drugs)ను అమ్మడంతో పాటు రూంకు తెచ్చేవారని ఆమె స్నేహితుడు కిశోర్‌ అమన్‌ శెట్టి చెప్పినట్లు తెలిపారు. తరుణ్(Tarun), అనుశ్రీలు డ్రగ్స్‌ పార్టీలకు వెళ్లడంతో పాటు రూంకు తీసుకొచ్చేవారు. అనుశ్రీ బెంగళూరులో నృత్య సాధన చేస్తున్న సమయంలో డ్రగ్స్‌ సేవిస్తే ఖుషీగా డ్యాన్స్‌ చేయవచ్చని తోటివారితో చెప్పేది. అనుశ్రీ రియాలిటీ షోలో గెలిచిన సమయంలో తరుణ్‌ డ్రగ్స్‌ పార్టీ ఇచ్చాడు.  

నేను అలా అనలేదు: అమన్‌శెట్టి
అనుశ్రీ డ్రగ్స్‌ తీసుకొంటుందని తాను పోలీసుల విచారణలో చెప్పలేదని తాజాగా కిశోర్‌ అమన్‌శెట్టి(Aman Shetty) ప్రకటించాడు. ఆయన మంగళూరులో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆమెతో నాకు పరిచయం లేదు, 2009లో కుణియోణ బారా కన్నడ డ్యాన్స్‌ షో(Dance Show)లో కలిశాను. తరువాత ఆమెను ఎప్పుడూ ఎక్కడా కలవలేదన్నారు. చార్జీషీట్లో పొందుపరిచిన ఆరోపణలను ఖండించారు. అనుశ్రీపై ఎలాంటి విరుద్ధ వ్యాఖ్యలు చేయలేదన్నారు.

Aslo Read: Anasuya Photos: "జబర్దస్త్" ఫోటోలతో అదరగొడుతున్న యాంకర్ అనసూయ

అన్ని రంగాల ప్రముఖులు ఈ దందాలో ఉన్నారు: ఇంద్రజిత్‌
డ్రగ్స్‌ కేసులో నిందితుల మూత్రం, రక్తం పరీక్షిస్తే చాలదు. తల వెంట్రుకలను కూడా పరీక్షించాలని నిర్మాత, పాత్రికేయుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌(Indrajith Lankesh) డిమాండ్‌ చేశారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలున్నవారందరూ మళ్లీ డ్రగ్స్‌ పార్టీలకు వెళ్తున్నారు. డ్రగ్స్‌ కేసు కర్ణాటక(Karnataka)లో పెద్ద కుంభకోణం. అన్ని రంగాల ప్రముఖులు ఈ దందాలో ఉన్నారు. బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయి అని ఆయన ఆరోపించారు.

విశ్రాంత ఐపీఎస్‌ జోక్యం: సంబరగి
ఒక రిటైర్డు ఐపీస్‌ అధికారి ప్రభావంతో డ్రగ్స్‌ కేసు దారి తప్పినట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత సంబరగి (Sambargi)బెంగళూరులో ఆరోపించారు. తరుణ్‌ అనే వ్యక్తిని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు, చార్జీషీట్లో అతని పేరును ఎందుకు పేర్కొనలేదు? అని ప్రశ్నించారు. బెంగళూరు(Bangalore) కంటే మంగళూరులో డ్రగ్స్‌ మాత్రలు ఎక్కువగా దొరుకుతాయని కిశోర్‌ అమన్‌శెట్టి చెప్పాడన్నారు.  

అనుశ్రీ మాటల్లో..  
తను ఏ తప్పు చేయలేదంటూ అనుశ్రీ ఒక వీడియోను సోషల్‌ మీడియా(Social Media)లో పోస్ట్‌ చేసింది. నేను బెంగళూరుకు 14 ఏళ్ల క్రితం బస్సులో వచ్చి చేరుకున్నా. సుమారు 12 ఏళ్ల కాలం పాటు హాస్టల్‌లో ఉన్నాను. ఆ తర్వాత నాటక రంగంలో ఆఫర్లు వచ్చాయి. నేను మంచిగా ఉన్నాను, కనుకనే ఇంత పెద్ద స్థాయికి ఎదిగాను. అయితే డ్రగ్స్‌ కేసులో విచారించడం బాధకు గురి చేసింది అన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News