Samyuktha Menon: సంయుక్త మీనన్ పెళ్లి.. వైరల్ అవుతున్న న్యూస్..

Samyuktha Menon Wedding: జూనియర్ సమంత లాగా కనిపించే సంయుక్త మినన్ ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ గురించి వస్తోంది ఒక వార్త అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2024, 05:36 PM IST
Samyuktha Menon: సంయుక్త మీనన్ పెళ్లి.. వైరల్ అవుతున్న న్యూస్..

Samyuktha: పవన్ కళ్యాణ్.. రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సంయుక్త మీనన్. కాగా ఈ హీరోయిన్ కి గత సంవత్సరం బాగా అచ్చి వచ్చింది. ధనుష్ హీరోగా చేసిన సార్ .. సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన విరూపాక్ష సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది. 

ముఖ్యంగా విరూపాక్ష సినిమాలో నటన ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ లో కనిపించి అదరగొట్టింది. అయితే ఇలా వరస పెట్టి సూపర్ హిట్లు అందుకున్నా కానీ ఈ హీరోయిన్ ఈమధ్య సినిమాల పరంగా కాస్త స్పీడు తగ్గించినట్టు అనిపిస్తుంది. అందుకు కారణం ఈ ఏడాది తన బాయ్ ఫ్రెండ్ ని సంయుక్త పెళ్లాడనున్నారంటూ.. అందుకే సినిమాలు తగ్గించిందంటే వార్తలు జోరున వినిపిస్తున్నాయి.

2016 లో ‘పాప్ కార్న్’ అనే మళయాళ సినిమాతో తెరపై ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. ఆ తర్వాత తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించారు. 2018 లో ‘కలరి’ అనే సినిమాతో తమిళనాట అడుగుపెట్టారు. కాగా తెలుగులో మొదటగా హీరో కళ్యాణ్ రామ్ సినిమా బింబిసారలో నటించినా కానీ మొదటిగా విడుదలైంది మాత్రం భీమ్లా నాయక్. ఆ తర్వాత సార్, విరూపాక్ష లాంటి సూపర్ హిట్లు అందుకుంది.

అయితే సంయుక్త గుంటూరు కారం చిత్రంలో కూడా నటించనున్నట్లు..  తనకు వరసగా తెలుగు సినిమా ఆఫర్లు వచ్చినట్లు ఈమధ్య వార్తలు వినిపించాయి. కానీ సంయుక్త డెవిల్ చిత్రం లో తప్ప ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అందుకు ముఖ్య కారణం ఈ హీరోయిన్ ప్రేమలో ఉండడమే అని గట్టిగా వినిపిస్తోంది.

ఆ మధ్య సంయుక్త విడాకులు తీసుకున్న ఓ తమిళ హీరోతో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో అవంతా రూమర్లుగా కొట్టిపారేశారు. తాజాగా సంయుక్త పెళ్లి వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే తన స్నేహితుడితో డేటింగ్ లో ఉన్న సంయుక్త అతనిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరి పెళ్లి ఈ సంవత్సరం మధ్యలో జరగనున్నట్లు వార్త కూడా వినిపిస్తుంది. ఈ వార్తలపై నిజమెంతో.. ఆ పెళ్లికొడుకు ఎవరో సంయుక్త వెల్లడించాల్సి ఉంది. 

Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల

Also Read: Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు! 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News