Samantha Yashoda overseas Collections : సమంత స్టామినా ఇదే.. అక్కినేని వారు అందుకోలేనంత ఎత్తులో

Yashoda overseas Collections సమంత యశోద సినిమాకు ఇప్పుడు తిరుగులేకుండా పోయింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా పోతోంది. ఇప్పటికే హాఫ్‌ మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2022, 09:42 AM IST
  • బాక్సాఫీస్ వద్ద సమంత జోరు
  • ఓవర్సీస్‌లో యశోద సందడి
  • హాఫ్ మిలియన్ క్లబ్బులో సమంత
Samantha Yashoda overseas Collections : సమంత స్టామినా ఇదే.. అక్కినేని వారు అందుకోలేనంత ఎత్తులో

Samantha Yashoda overseas Collections : సమంత యశోద సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేస్తోంది. మొదటి వీకెండ్‌ అంటే మూడు రోజుల్లోనే దాదాపు ఇరవై కోట్ల గ్రాస్, పది కోట్ల షేర్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరించింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో అయితే రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. గత కొన్ని నెలలుగా ఓవర్సీస్ మార్కెట్లో మన తెలుగు సినిమాలు బెడిసి కొట్టేస్తున్నాయి. ఈ క్రమంలో సమంత తన యశోద సినిమాతో ఊపిరి పోసింది. రెండ్రోజుల్లోనే నాగ చైతన్య థాంక్యూ సినిమా కలెక్షన్లను లేపి అవతలపారేసింది. థాంక్యూ మూవీకి మొత్తంగా $200k డాలర్లు వస్తే.. సమంత యశోదకు అవి రెండ్రోజుల్లోనే వచ్చాయి.

ఇక ఇప్పుడు సమంత మరో రేర్ ఫీట్‌ను క్రియేట్ చేసింది. యశోద సినిమా హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరింది. $500k డాలర్లను కలెక్ట్ చేసి సమంత అందరినీ ఆశ్చర్యపరించింది. సమంత యశోదకు ఓవర్సీస్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సమంత యశోద బాగానే ఆడేస్తోంది. సమంత యశోద దెబ్బకు నాగ చైతన్య థాంక్యూ, నాగార్జున ఘోస్ట్ సినిమాలు వెలవెలబోయినట్టు కనిపిస్తోంది.

థాంక్యూ, ఘోస్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఈ రెండు చిత్రాలు కలెక్షన్ల పరంగా దారుణమైన స్థితిలో ఉన్నాయి. అదే యశోద మాత్రం లేడీ ఓరియెంటెడ్ చిత్రమైనా కూడా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. అర్జెంట్‌గా ఇప్పుడు అక్కినేని వారికి ఓ సాలిడ్ హిట్ రావాల్సి ఉంటుంది. లేదంటే ఇలా సమంత అభిమానులు అక్కినేని సినిమాలతో పోల్చుతూనే ఉంటారు.

నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయింది. కరోనా సమయంలోనూ ఈ చిత్రం రావడం, మిగతా చిత్రాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో బంగార్రాజు బాగానే రాబట్టేసింది. కానీ థాంక్యూ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి.. దారుణంగా బెడిసి కొట్టేసింది. అక్కినేని వారి సినిమాలు ఇలా ఫ్లాప్ అవుతుంటే.. సమంత మాత్రం సక్సెస్‌తో దూసుకుపోతోంది.

Also Read : Bigg Boss 6 Telugu Prize Money : బిగ్ బాస్ షోలో కొత్త పథకం.. ప్రైజ్ మనీలో కోతలు.. చివరకు మిగిలేది ఎంతంటే?

Also Read : Trivikram - Krishna Death: కృష్ణ మరణానికి కారణం త్రివిక్రమా? నెటిజెన్ వింత వాదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News