Samantha to play pregnant woman : గర్భిణీగా మారిన సమంత, తన కోరికను అలా తీర్చుకుందట!

Samantha to play pregnant woman role in Yashoda Movie : ఛాలెంజింగ్ రోల్స్‌తో అలరిస్తోన్న సమంత.. పాన్ ఇండియా మూవీ "యశోద" మూవీలోని సామ్ రోల్‌పై సోషల్ మీడియాలో ఇప్పుడు పలు పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 01:11 PM IST
  • ఛాలెంజింగ్ రోల్స్‌తో అలరిస్తోన్న సమంత
  • పాన్ ఇండియా మూవీలో గర్భిణీగా సమంత
  • "యశోద" మూవీపై భారీ అంచనాలు
Samantha to play pregnant woman : గర్భిణీగా మారిన సమంత, తన కోరికను అలా తీర్చుకుందట!

Samantha to play pregnant woman role in Yashoda Movie : చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు డిఫరెంట్‌ రోల్స్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఛాలెంజింగ్ ఉన్న రోల్స్‌ను ఎంచుకుంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో (Lady Oriented Cinema) తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు.

ఇప్పటికే చాలామంది హీరోయిన్స్‌ (Heroines‌) పలు ఛాలెంజింగ్ రోల్స్‌తో తమకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. ఇక మంచి క్రేజ్‌ ఉన్న హీరోయిన్స్‌ గర్భిణీగా నటించడం చాలా రేర్‌‌గా జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమన్ రోల్ (pregnant woman role) అంటే మాములు విషయం కాదు. అయితే గర్భిణీగా (pregnant) నటించిన టాప్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. రమ్యకృష్ణ, శ్రీదేవి, కీర్తి సురేష్, నయనతార, విద్యా బాలన్ లాంటి వారు గర్భిణీ పాత్రలు (pregnant woman roles) పోషించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇక ఆ కోవలోనే సమంత (Samantha) కూడా పయనిస్తోంది. సమంత ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న "యశోద"లో నటిస్తోంది. హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సమంత గర్భిణీగా కనిపించనుందట. అయితే ఇప్పటికే "యశోద" మూవీలో సమంత నర్స్‌గా నటిస్తుందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా సామ్ ప్రెగ్నెంట్‌గా (Sam pregnant‌) కనిపిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. దీంతో "యశోద" మూవీ (Yashoda Movie) భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

సామ్ ఈ మూవీలో నర్స్ పాత్ర పోషిస్తోందని ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు అనుకోని సంఘటనలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కొంటోంది అనే కోణంలో ఈ మూవీని (Movie) తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే "యశోద" మూవీలోని (Yashoda Movie) సామ్ రోల్‌పై ఇప్పడు సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్స్‌పై నెటిజన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Beijing Winter Olympics: విశ్వక్రీడలపై కరోనా పంజా.. ప్రేక్షకులు లేకుండానే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్

నాగ చైతన్యతో సమంత విడిపోవడానికి కారణం పిల్లల టాపికే కారణం అని, సమంత పిల్లలు (Samantha children) కావాలని కోరుకోగా.. చైతన్య నిరాకరించాడని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. అందుకే వారిద్దరూ విడిపోయారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే "యశోద" మూవీలో సమంత ప్రెగ్నెంట్ రోల్‌తో (Pregnant roll) తన కోరికను తీర్చుకుంటోంది అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లాంచింగ్ షెడ్యూల్‌తో "యశోద" మూవీ షూటింగ్ ప్రారంభమైంది. మరి కొన్ని రోజుల్లో బేబీ బంప్‌తో సమంత (Samantha) న్యూ లుక్ కూడా "యశోద" మూవీ నుంచి రానుంది.

Also Read : Covid Vaccine for Children: 12- 14 ఏళ్ల వయసు చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ అవాస్తవం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News