అందుకు సారీ చెప్పిన సమంత.. మరింత ఫిదా అయిన అభిమానులు

అభిమానులకు సారీ చెప్పి వారిని ఆశ్చర్యానికి గురిచేసిన సమంత 

Last Updated : Aug 18, 2018, 08:58 PM IST
అందుకు సారీ చెప్పిన సమంత.. మరింత ఫిదా అయిన అభిమానులు

సమంత అక్కినేని, రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యూ టర్న్ సినిమా ట్రైలర్ నిన్న శుక్రవారం రిలీజైంది. సాధారణంగా సమంత నటించిన అన్ని సినిమాలకు ప్రముఖ నేపథ్యగాయని చిన్మయి డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, సస్పెన్స్ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు మాత్రం సమంత తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అయితే, నిన్న రిలీజైన ట్రైలర్‌లో సమంత డబ్బింగ్‌ విన్న ఆడియెన్స్, అభిమానులు కొంచెం వేగంగానే స్పందించారు. సమంత డబ్బింగ్ బాగోలేదని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇంకొంతమంది డబ్బింగ్ సరిచేసుకోమంటూ నేరుగానే సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. 

  
యూ టర్న్ ట్రైలర్ రిలీజ్ అనంతరం తన డబ్బింగ్ గురించి సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలపై దృష్టిసారించిన సమంత.. తనకు ట్విటర్ ద్వారా ఓ అభిమాని డబ్బింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇచ్చిన సలహాకు చాలా సానుకూలంగా స్పందించారు. "డబ్బింగ్‌ను సరి చేస్తున్నాం. అందుకు సారీ" అని రిప్లై ఇచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు సమంత. నెటిజెన్స్ ఇచ్చిన సలహాను సహృదయంతో స్వీకరించి సానుకూలంగా స్పందించడమేకాకుండా... తన తప్పిదానికి క్షమించాల్సిందిగా కోరడం చూసి సమంత అభిమానులు మరింత ఫిదా అయ్యారు. ఈ ఒక్క ట్వీట్‌తో అందం, అభినయమే కాకుండా.. విమర్శల్ని సైతం స్వీకరించే వ్యక్తిత్వం తన సొంతం అని రూపించుకుందామె అని సమంతపై ప్రశంసలు గుప్పిస్తున్నారు ఆమె అభిమానులు.

 

 

పవన్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భూమికా చావ్లా సైతం మరో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు.

Trending News