Samantha Ruthprabhu: మా సినిమాలో విలన్ గా నటించమన్న అడివిశేష్.. సమంత మైండ్ బ్లాకింగ్ రిప్లై!!

Samantha Ruthprabhu Funny Reply: అడవి శేషు హీరోగా హిట్ 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో సమంత ఆసక్తిరమైన ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 2, 2022, 10:20 PM IST
Samantha Ruthprabhu: మా సినిమాలో విలన్ గా నటించమన్న అడివిశేష్.. సమంత మైండ్ బ్లాకింగ్ రిప్లై!!

Samantha Ruthprabhu Funny Reply to Adivi Sesh: సమంత రుత్ ప్రభు మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె యశోద అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి డీసెంట్ హిట్ అందుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే దక్కింది.

అదేవిధంగా సమంత మార్కెట్తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు కూడా రాబట్టి ఈ సినిమా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఇక సమంత కొన్ని రోజుల నుంచి మళ్లీ అనారోగ్యంతో బాధపడుతోందని ఆమె చికిత్స తీసుకుంటుందని ఒకసారి, ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటుందని మరోసారి, లేదు దక్షిణ కొరియాకి ఆమెను తీసుకువెళుతున్నారని మరోసారి ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ వచ్చాయి.

అయితే ఈ విషయం మీద ఆమె పిఆర్ టీం ఎప్పటికప్పుడు స్పందిస్తూ అదేమీ లేదని చెబుతూ వస్తోంది. అయితే సమంత మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంతో ఆమె గురించి అనేక ప్రచారాలు అయితే  తెర మీదకు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా సమంత ఏమనుకుందో ఏమో కానీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది, అది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ట్రాఫిక్ గా మారింది. అడవి శేషు హీరోగా హిట్ 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఒక జర్నలిస్ట్ రాబోయే హిట్ సినిమాలలో సమంత లాంటి ఒక బలమైన ఫిమేల్ విలన్ ఉంటే బావుంటుందని కామెంట్ చేయడంతో దాన్ని అడవి శేషు రీ ట్వీట్ చేస్తూ ఇది నిజంగానే ఒక అద్భుతమైన ఐడియా ఏమంటావ్ సమంత అంటూ సమంతను అడిగితే సమంత కూడా బాడ్ యాస్ కాప్, వినడానికి ఫన్నీగా అనిపిస్తోంది అంటూ కామెంట్ చేసింది.

అయితే నువ్వు హిట్టు కొట్టినందుకు కంగ్రాట్స్ చెబుతూనే నిన్ను ఎప్పటికీ చీర్ చేస్తూ ఉంటాను అంటూ ఆమె కామెంట్ చేసింది. అంటే భవిష్యత్తులో ఆమె హిట్ సిరీస్ లో భాగమయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు హింట్ ఇచ్చేసింది. ఇక మరో పక్క ఆమె అభిమానులైతే సమంత ట్వీట్ చేసిందంటే ఆమె అనారోగ్యంతో బాధ పడటం లేదని యాక్టివ్గానే ఉందని ఆనందపడుతున్నారు. ఇక ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 

Also Read: Students attacked: కీచకుడిగా మారిన టీచర్.. చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పిన బాలికలు

Also Read: BJP: బీజేపీలో పదవుల జాతర.. కాంగ్రెస్ నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు కీలక పదవులు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News