Samantha reacts on Priyanka post: ప్రియాంక చోప్రా భర్త రోస్టింగ్‌పై స్పందించిన సమంత

Samantha reacts to Priyanka roasting hubby Nick Jonas: ప్రియాంక కూడా నటి సమంత (Samantha) మాదిరి విడాకులు తీసుకోబోతుందా అంటూ సోషల్ మీడియాలో (Social media) చర్చలు నడిచాయి. ఈ వార్తలను ప్రియాంక తల్లి మధు చోప్రా ఖండించింది. అవన్నీ వట్టి పుకార్లే అని తెలిపింది. ఇక తాజాగా ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టింది ప్రియాంక. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 09:37 PM IST
  • ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ నుంచి విడిపోతున్నట్లుగా వార్తలు
  • ఇన్‌స్టా గ్రామ్‌ ఫ్రొఫైల్‌లో నిక్ జోనాస్‌ పేరు తొలగించిన ప్రియాంక
  • నటి సమంత మాదిరి ప్రియాంక విడాకులు తీసుకోబోతుందా అంటూ చర్చ
  • రూమర్స్‌కు చెక్‌ పెట్టిన ప్రియాంక
Samantha reacts on Priyanka post: ప్రియాంక చోప్రా భర్త రోస్టింగ్‌పై స్పందించిన సమంత

Samantha Ruth Prabhu reacts to Priyanka Chopra roasting hubby Nick Jonas; calls it 'amazing': ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ నుంచి విడిపోతున్నట్లుగా వచ‍్చిన వార్త తాజాగా చాలా వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఈ వార్తపైనే చర్చ సాగింది. ఇందుకు కారణం ప్రియాంక (Priyanka) తన ఇన్‌స్టా గ్రామ్‌ ఫ్రొఫైల్‌లో నిక్ జోనాస్‌ పేరు తొలగించడం. ప్రియాంక కూడా నటి సమంత (Samantha) మాదిరి విడాకులు తీసుకోబోతుందా అంటూ సోషల్ మీడియాలో (Social media) చర్చలు నడిచాయి. ఈ వార్తలను ప్రియాంక తల్లి మధు చోప్రా ఖండించింది. అవన్నీ వట్టి పుకార్లే అని తెలిపింది. ఇక తాజాగా ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టింది ప్రియాంక. ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. నిక్‌ జొనాస్‌పై సరదా కామెంట్స్ చేసింది ప్రియాంక. నిక్ జొనాస్‌కు, ఆయన బ్రదర్స్ కంటే తనకే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉ‍న్నారంటూ ప్రియాంక (Priyanka Chopra) పేర్కొంది. 

నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జరిగిన జొనాస్‌ బ్రదర్స్‌ ఫ్యామిలీ రోస్ట్ అనే షోలో జొనాస్‌ కుటుంబం పాల్గొంది. తాను సంస్కృతి, వినోదం, సంగీతానికి గొప్ప స్థానం ఉన్న భారతదేశం నుంచి వచ్చానని పేర్కొంది ప్రియాంక. తనకంటే 10 ఏళ‍్లు చిన్నవాడు అయిన నిక్‌.. తాను అనేక విషయాలు మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చింది. తనకు నిక్‌పై చాలా ప్రేమ ఉందని.. తన జీవితాన్ని అతను పూర‍్తిగా మార్చేశాడని పేర్కొంది ప్రియాంక.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

 

Also Read : మీ వద్ద ATM or credit cards ఉన్నాయా ? అయితే Free insurance ఆఫర్ ఉన్నట్టేనట!

ఇక ఈ వీడియోపై సమంత (Samantha) స్పందించింది. అమేజింగ్ అంటూ క్యాప్షన్స్ ఇస్తూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది సామ్ (Sam). అయితే తాజాగా సమంత తన పెంపుడు కుక్క హష్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అలాగే ఇన్‌స్టా స్టోరీస్‌ లో హష్‌కు తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఫొటోలు పెట్టింది. ఆ కుక్క మీద అంత ప్రేమ కురిపిస్తున్న సామ్‌ (Samantha) తన మాజీ భర్త నాగచైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.

Also Read : Tamannaah Feels Like A Goddess : దేవ‌త‌ గెటప్‌లో త‌మ‌న్నా.. అరటాకులో భోజ‌నం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News