Samantha : జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి.. సమంత పోస్ట్ వైరల్

Samantha Ruth Prabhu Citadel సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్‌ షూట్‌తో బిజీగా ఉంది. షూటింగ్ కోసం కారులో బయల్దేరినట్టుగా కనిపిస్తోంది. కారులో వెళ్తోండగా అలా క్యాప్షన్ ఇచ్చేసింది. ఫైండ్ ది లైట్‌ అంటూ పోస్ట్ వేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 09:59 AM IST
  • సిటాడెల్‌ షూట్‌లో సమంత
  • వెలుగుని వెతుక్కోమంటోన్న సామ్
  • ట్రావెలింగ్‌లో బిజీగా సమంత
Samantha : జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి.. సమంత పోస్ట్ వైరల్

Samantha joins Citadel Shoot సమంత గత ఆరేడు నెలలుగా ఎంతటి నరకాన్ని అనుభవించిందో అందరికీ తెలిసిందే. మయో సైటిస్ కారణంగా సమంత బెడ్డుకే పరిమితం కావాల్సి వచ్చింది. లేచి నిల్చోవడం, నడవడం కూడా ఎంతో కష్టంగా మారింది. అంతు చిక్కని వ్యాధి, అరుదైన వ్యాధి, త్వరలో చచ్చిపోతుందా? అంటూ వచ్చిన వార్తల మీద కూడా సమంత స్పందించింది. తాను ఇంకా చనిపోలేదని, చనిపోను కూడా అంటూ తన ధైర్యాన్ని, తెగువను ప్రదర్శించింది సమంత.

మొత్తానికి సమంత ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో వెనుదిరిగి వచ్చింది. సమంత మరింత స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు సమంత తన సినిమాలను మళ్లీ లైన్లోకి తీసుకొచ్చేస్తోంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. సమంతకు ఆరోగ్యం బాగా లేదన్న కారణంతోనే సిటాడెట్, ఖుషి సినిమాలు అటకెక్కేశాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఇప్పుడు సమంత రెడీ అవ్వడంతో ఈ రెండు ప్రాజెక్టులు కదిలాయి. ముందుగా రాజ్ అండ్ డీకే ప్రాజెక్టుకే సమంత ఓటు వేసింది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌ ఇప్పుడు ఫుల్ స్వింగులో ఉంది. అయితే షూటింగ్ కోసమని అలా కారులో బయల్దేరినట్టుంది. మధ్యలో ఇలా క్యాప్షన్‌తో ఫోటోను షేర్ చేసింది. కారులో ప్రయాణిస్తూ అలా కళ్లు మూసింది. జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి అంటూ మెసెజ్ ఇచ్చింది.

అసలే సమంత ఇన్ని రోజులు ఒంటరిగా పోరాడింది. మయోసైటిస్‌తో పోరాడి.. గెలిచింది సమంత. సమంత ఇన్ని రోజులు చీకట్లోనే ఉన్నట్టు అయింది. ఇప్పుడు సమంత మళ్లీ ఫాంలోకి వచ్చింది. ఇక ఇదే నెలలో ఖుషి సినిమా షూటింగ్‌లోనూ జాయిన్ కాబోతోంది. ఇదే విషయాన్ని ఓ నెటిజన్‌కు సమంత సమాధానంగా చెప్పింది. సమంత వస్తుండటంతో మళ్లీ పనులు మొదలుపెట్టేశారు మేకర్లు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయట.

Also Read:  Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?

Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండ

Trending News