Samantha Ruth Prabhu : వారందరికీ నేను చెప్పదల్చుకున్నది ఇదే.. సమంత పోస్ట్ వైరల్

Samantha Battle సమంత ప్రస్తుతం తనలో తానే, తనతో తానే యుద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. తనకు వచ్చిన మయోసైటిస్‌తో సమంత పోరాడుతోంది. ప్రస్తుతానికి సమంత అయితే ఇంటికే పరిమితమంది. చికిత్స తీసుకుంటూనే ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 04:21 PM IST
  • మయోసైటిస్‌ వ్యాధితో పోరాడుతోన్న సమంత
  • చికిత్స తీసుకుంటూ ఇంటికే పరిమితమైన సామ్
  • రాహుల్ రవీంద్రన్ పోస్ట్ మీద సమంత ఎమోషనల్
Samantha Ruth Prabhu : వారందరికీ నేను చెప్పదల్చుకున్నది ఇదే.. సమంత పోస్ట్ వైరల్

Samantha Ruth Prabhu Myositis సమంత ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోన్న విషయం తెలిసిందే. మయోసైటిస్ చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్లింది.. ఇంకెక్కడికో వెళ్లింది అంటూ ఇలా రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే సమంత మాత్రం హైద్రాబాద్‌లోని తన ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటోంది. ఇక ఇప్పుడు సమంత బయటకు వచ్చి సినిమా షూటింగ్‌లో పాల్గొనే పరిస్థితి లేనట్టుగా కనిపిస్తోంది. అందుకే సమంత కొత్త సినిమాలేవీ సైన్ చేయడం లేదట. ఖుషి సినిమాను మాత్రం పూర్తి చేయాలని భావిస్తోందట.

ఆ తరువాత సమంత పూర్తిగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటోందట. అందుకే సమంత జనవరిలో ఖుషీ కోసం సెట్స్ మీదకు వస్తుందని అంతా అనుకుంటున్నారు. వస్తుందా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. అయితే సమంత ఇప్పుడు తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యుద్దం చేస్తోంది. మయోసైటిస్ నుంచి బయటపడాలని సమంత తన శాయశక్తులా పోరాడుతోంది.

 

సమంత పోరాటం మీద రాహుల్ రవీంద్రన్ ఓ పోస్ట్ వేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి సమస్యలు వచ్చినా కూడా నువ్ పోరాడుతూనే ఉన్నావ్.. ఇంకా పోరాడుతూనే ఉంటావ్.. ఎందుకంటే నువ్ ఉక్కు మహిళవి.. నిన్నూ ఏదీ ఓడించలేదు.. బాధపెట్టలేదు.. పైగా అవన్నీ నిన్ను మరింత స్ట్రాంగ్‌గా చేస్తుంటాయి అని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చాడు. దీనిపై సమంత స్పందించింది.

థాంక్యూ రాహుల్ అని ఎమోషనల్ అయింది సమంత. బయట ఎవరైతే తమ జీవితాలతో పోరాడుతున్నారో వారందరి కోసం ఇది చెబుతున్నా.. పోరాడుతూనే ఉండండి.. ఇంకా మీరు బలంగా తయారవుతూ ఉంటారు.. ఇంకా ధృడంగా మారి కష్టాలను ఎదురిస్తారు అని చెప్పుకొచ్చింది సమంత.

Also Read : Christmas 2022 : క్రిస్మస్ సెలెబ్రేషన్స్.. రష్మిక అలా.. శ్రుతి హాసన్ ఇలా.. సింపుల్‌గా సితార

Also Read : S Thaman TRolling  : విజయ్‌కి ఫ్యాన్‌.. ఎంత మందికి అదే మాట చెబుతావ్.. తమన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News