Samantha's House in Hyderabad: సమంత హైదరాబాద్‌లో కొత్తగా కొన్న ఇంటి ఖరీదు ఎంతో తెలుసా ?

Samantha Buys Expensive House in Hyderabad: ఫిలింనగర్లో, సోషల్ మీడియాలో.. ఇలా ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవ్వరి నోట విన్నా.. సమంత కొన్న ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా ? అనే ప్రశ్నే వినబడుతోంది. ఇంతకీ సమంత కొనుగోలు చేసిన డూప్లెక్స్ బంగ్లా ఖరీదు ఎంతో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్‌లోకి వెళ్లాల్సిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2023, 12:39 PM IST
Samantha's House in Hyderabad: సమంత హైదరాబాద్‌లో కొత్తగా కొన్న ఇంటి ఖరీదు ఎంతో తెలుసా ?

Samantha's House in Hyderabad: టాలీవుడ్‌లో సినిమాలు చేస్తోన్న చాలామంది హీరోయిన్స్ హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడైతే దక్షిణాది హీరోయిన్స్ చెన్నైలోనో లేక బెంగళూరులోనో ప్రాపర్టీలు కొనే వారు. అలాగే ఉత్తరాది హీరోయిన్స్ ముంబైలో ఉంటూ కేవలం షూటింగ్స్‌కి మాత్రమే హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉండే వారు. కానీ దాదాపు ఒక దశాబ్ధ కాలం నుంచి ట్రెండ్ మారిపోయింది. ఇక్కడ సినిమాలు చేస్తోన్న హీరోయిన్స్ ఇక్కడే ఇల్లు కొనేసుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ సమంత కూడా అదే పని చేసింది.  

సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులను సినీ ప్రముఖులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతున్నారనేది జగమెరిగిన సత్యం. రియల్ ఎస్టేట్ అంటే కొంతమంది ఎకరాలకు ఎకరాలు భూములు కొనుక్కుని ఫామ్ హౌజ్‌లు నిర్మించుకుంటుంటే.. ఇంకొంతమంది నగరంలోనే ఖరీదైన ప్రాంతాల్లో ఫామ్ హౌజ్ లాంటి సకల హంగులతో ఉన్న ఖరీదైన బంగ్లాలు కొంటున్నారు. సమంత కూడా అలాగే హైదరాబాద్ శివార్లలో ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని నానక్‌రాంగూడ సమీపంలోని జయభేరీ ఆరేంజ్ కౌంటిలో ఒక డూప్లెక్స్ బంగ్లా కొనుగోలు చేసింది. 

సమంత ఇల్లు కొనుగోలు వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్ గా మారింది. ఫిలింనగర్లో, సోషల్ మీడియాలో.. ఇలా ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవ్వరి నోట విన్నా.. సమంత కొన్న ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా ? అనే ప్రశ్నే వినబడుతోంది. ఇంతకీ సమంత కొనుగోలు చేసిన డూప్లెక్స్ బంగ్లా ఖరీదు ఎంతనుకుంటున్నారు.. అక్షరాల 7 కోట్ల 80 లక్షల రూపాయలు. సమంత కొనుగోలు చేసిన ఈ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ 13వ, 14వ అంతస్తులలో విస్తరించి ఉంది. ఇంటి విస్తీర్ణం 7,944 చదరపు అడుగుల విస్తరించి ఉంది.

అయితే, సమంత హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కోవడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది జూలైలోనే సమంత హైదరాబాద్ లో ఇల్లు కొనుగోలు చేసింది. ఆ ఇల్లు కూడా మరేదో కాదు.. గతంలో తాను, నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు కొనుక్కున్న ఇంటినే సమంత మరొకసారి తిరిగి కొనుగోలు చేసింది. చైతూతో డైవర్స్ తీసుకోవడానికి ముందు ఇద్దరూ కలిసి ఆ ఇంటిని వేరొకరికి విక్రయించారు. చైతూతో డైవర్స్ తీసుకుని వేరుగా ఉండటం మొదలుపెట్టిన తరువాత అదే ఇంటిని సమంత మరింత ఎక్కువ మొత్తంలోనే వెచ్చించి సొంతం చేసుకున్నట్టు మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. సమంత కొన్న ఈ ఇంటి విలువ రూ. 100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

చైతూ, సమంత విడిపోవడానికి ముందు కలిసి అమ్మిన ఇంటినే ఆ తరువాత సమంత ఒక్కర్తే భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసింది అనే విషయాన్ని మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడాని కంటే ముందు సమంతకు వ్యతిరేకంగా పెద్ద ప్రచారమే జరిగింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంతకు అక్కినేని కుటుంబమే ఆ ఇంటిని భరణం కింద ఇచ్చిందని రకరకాల ప్రచారం నడిచింది. సమంత ఆ ఇంటిని అప్పనంగా కొట్టేసిందని కొంతమంది కామెంట్స్ చేశారు. సమంత గురించి ఏవేవో మాట్లాడుకున్నారు. సమంతకు భరణం కింద అక్కినేని కుటుంబం నుంచి రూ. 250 కోట్లు ముట్టాయని.. అందులో భాగంగానే ఈ బంగ్లా కూడా సొంతమైందనే కామెంట్స్ వినిపించాయి. కానీ సమంత ఎక్కువ ధర పెట్టి మరీ ఆ ఇంటిని కొనుగోలు చేసిందని మురళి మోహన్ అసలు విషయం చెప్పాక ఆ ప్రచారం పటాపంచలైంది. 

ఇది కూడా చదవండి : Comedian Prudhvi : హాస్పిటల్ బెడ్డు మీద పృథ్వీరాజ్.. సినిమాల గురించే ఆలోచిస్తున్నాడట.. ప్రమోషనల్ స్టంటా?

సమంత అప్‌కమింగ్ సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా చెన్నై స్టోరీ అనే సినిమాకు కూడా సమంత సైన్ చేసింది. చెన్నై స్టోరీ మూవీలో వివెక్ కల్రా అనే భారతీయ మూలాలు ఉన్న బ్రిటిష్ యాక్టర్‌తో కలిసి నటించనుంది. సమంత ప్రధాన పాత్రలో చేసిన శాకుంతలం మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాన్నే మిగిల్చింది అని ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండకు సైతం అతడి చివరి సినిమా లైగర్ అటువంటి చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇప్పుడు సమంతకు, విజయ్ దేవరకొండకు.. ఇద్దరికీ ఒక హిట్ అవసరం అనుకుంటున్న సమయంలో వస్తున్న సినిమానే ఖుషీ. మరి ఖుషీ ఈ ఇద్దరికీ ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనుందో వేచిచూడాల్సిందే.

ఇది కూడా చదవండి : Pawan Kalyan OG : దారినపోయే దానయ్యవి కాదు.. దేవుడివి దానయ్య.. దండం పెట్టేస్తోన్న పవర్ స్టార్ ఫ్యాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News