Samantha Ruth Prabhu : ఏం తింటామో కాదు.. ఏం ఆలోచిస్తున్నామనేది ముఖ్యం!.. అవాక్కయ్యేలా చేసిన సమంత

Samantha Ruth Prabhu Videos సమంత ప్రస్తుతం తన శక్తిని తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే సమంత మళ్లీ వర్కౌట్లు మొదలుపెట్టేసింది. సమంత తాజాగా జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను షేర్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2023, 04:30 PM IST
  • నెట్టింట్లో సమంత బౌన్స్ బ్యాక్
  • వర్కౌట్ వీడియోలతో సామ్ సందడి
  • స్పూర్తివంతమైన కొటేషన్లతో సమంత
Samantha Ruth Prabhu : ఏం తింటామో కాదు.. ఏం ఆలోచిస్తున్నామనేది ముఖ్యం!.. అవాక్కయ్యేలా చేసిన సమంత

Samantha Ruth Prabhu Workout సమంతను చూస్తూ ఉంటే పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇన్ని నెలలు సమంత మంచానికే పరిమితమైంది. మయోసైటిస్ వ్యాధితో సమంత బాధపడుతూ ఇంట్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇక చికిత్స కోసం దక్షిణ కొరియాకు వెళ్లినట్టుగా కూడా రూమర్లు వచ్చాయి. కానీ ఆమె హైద్రాబాద్‌లోని తన ఇంట్లోనే ఉంది. ఐదారు నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంది. వైద్యుల సలహా మేరకు ఇప్పుడు సమంత బయటకు అడుగు పెట్టేసింది.

శాకుంతలం ట్రైలర్ ఈవెంట్‌లో సమంత కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. కానీ కొంత మంది మాత్రం సమంత చార్మింగ్ తగ్గిపోయిందని, అందంగా కనిపించడం లేదంటూ నెగెటివ్ కామెంట్లు చేశారు. దానిపై సమంత మండి పడింది. అలా కొన్ని నెలల పాటు బెడ్డు మీద ఉంటే.. చికిత్స తీసుకుంటే ఇంకెలా ఉంటారు.. అంటూ సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా సమంతను ట్రోల్ చేయడంతో నెటిజన్లు సైతం సామ్‌కు మద్దతుగా నిలబడ్డారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ప్రస్తుతం సమంత అయితే సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ముంబైకి వెళ్లింది. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టులో వరుణ్ ధావన్‌, సమంత నటిస్తున్నారు. నెక్ట్స్ నెలలో మళ్లీ విజయ్ దేవరకొండ ఖుషి సినిమా సెట్‌లో సమంత అడుగు పెడుతుంది. అయితే అంత వరకు మళ్లీ స్ట్రాంగ్ అవ్వాలని సమంత ఫిక్స్ అయినట్టుగా ఉంది.

సరైన డైటింగ్ అంటే మనం ఏం తింటున్నామో అది కాదు.. మన ఏం ఆలోచిస్తాం.. ఎలా ఆలోచిస్తాం అనేదాన్ని బట్టి ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ఇక సమంత చేస్తోన్న హెవీ వర్కౌట్లు, పుల్ అప్స్ చూస్తుంటే పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తోంది. ఇకపై బ్రేకుల్లేకుండా సమంత తన సినిమాలను పూర్తి చేసేలా ఉంది.

Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News