Samantha on Chaitanya-Sobhita Dating: ఎవరు ఎవరితో చేసుకున్నా నాకేం బాధలేదు.. నాగ చైతన్య - శోభిత డేటింగ్‌పై సమంత రియాక్షన్

Samantha Ruth Prabhu: నాగ చైతన్య శోభిత ధూళిపాళ డేటింగ్‌ చేస్తున్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై చైతూ గానీ, శోభిత గానీ ఎక్కడా స్పందించలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2023, 09:11 AM IST
  • నాగ చైతన్య శోభితల డేటింగ్
  • చైతూ డేటింగ్‌పై సామ్ రియాక్షన్
  • ఎవరెటు పోయినా బాధలేదన్న సమంత
Samantha on Chaitanya-Sobhita Dating: ఎవరు ఎవరితో చేసుకున్నా నాకేం బాధలేదు.. నాగ చైతన్య - శోభిత డేటింగ్‌పై సమంత రియాక్షన్

Samantha Reacts on Naga Chaitanya-Sobhita Dhulipala Dating: సమంత నాగ చైతన్యల విడాకుల వ్యవహారం మీద లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. చివరకు అవే నిజమయ్యాయి. వారిద్దరూ విడాకులు తీసుకుని వేరు పడ్డారు. ఆ తరువాత రకరకాల విషయాలు తెర మీదకు వచ్చాయి. అయితే అందులో నాగ చైతన్య శోభిత డేటింగ్ రూమర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ డేటింగ్ రూమర్ల మీద నాగ చైతన్య ఎప్పుడూ స్పందించలేదు. కానీ తాజాగా సమంత వారిద్దరి డేటింగ్‌ మీద స్పందించినట్టుగా కనిపిస్తోంది.

ఎవరు ఎవరితోనైనా రిలేషన్‌లో ఉండనివ్వండి.. ఏమైనా చేసుకోనివ్వండి.. నాకేం బాధలేదు.. నేనేం పట్టించుకోను..  ప్రేమ విలువ తెలియని వారు.. ప్రేమించిన వాళ్లని కన్నీళ్లు నింపుతారు.. వారు ఎవరితో డేట్ చేసినా అంతే.. అయితే కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉంటే చాలు.. ఆమెను హర్ట్ చేయకుండా ప్రేమగా చూసుకునేలా ఆయన ప్రవర్తన మారితే చాలు.. అదే అందరికీ మంచిది అంటూ సమంత పరోక్షంగా స్పందించింది.

2021లో అక్టోబర్ 8న ఈ ఇద్దరూ కూడా విడాకులు తీసుకున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగానే నిలిచింది. పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయారు. అయితే ఈ విడిపోవడానికి గల కారణాలు మాత్రం క్లియర్‌గ చెప్పడం లేదు సమంత. తనను బంధించినట్టుగా, తనను కట్టడి చేయాలని చూశారంటూ ఇలా పరోక్షంగా కొన్ని సంఘటనలు చెబుతోంది. కానీ విడాకులకు సరైన కారణాలు మాత్రం ఇటు నాగ చైతన్య గానీ అటు సమంత గానీ చెప్పడం లేదు.

సమంత వల్లే విడాకులు అయ్యాయని కొందరు, కాదు నాగ చైతన్య వల్లే విడాకుల వరకు వ్యవహారం వచ్చిందని ఇంకొందరు కామెంట్లు చేయసాగారు. పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని ఇలా రకరకాలుగా రూమర్లు వచ్చాయి. ఇక సమంత, ప్రీతమ్ మధ్య కూడా అక్రమ సంబంధాన్ని అంటగట్టేశారు. అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం చైతూ డేటింగ్‌, అఫైర్ల మీద కౌంటర్లు వేశారు.

Also Read:  Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?

Also Read: Ritika Nayak Pics : లోపల ఏమీ వేసుకోకుండా రితికా నాయక్ రచ్చ.. రెచ్చిపోయిన విశ్వక్ సేన్ బ్యూటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News