Samantha Health Update: అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన సమంత.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?

Samantha is taking Ayurvedic Treatment: అనారోగ్యంతో బాధ పడుతున్న సమంత ఇప్పుడు హాస్పిటల్ పాలైనట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే, అయితే అది నిజం కాడనై ఆమె మేనేజర్ అంటున్నా ఇప్పుడు అసలు విషయం బయటకొచ్చింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 27, 2022, 10:47 AM IST
Samantha Health Update: అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన సమంత.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?

Samantha is taking Ayurvedic Treatment:నాగచైతన్యతో ప్రేమ వివాహం చేసుకుని ఆ తరువాత ఆయనకు విడాకులు కూడా ఇచ్చేసిన సమంత ప్రస్తుతానికి అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. సమంత తాను మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా మీడియాలో హడావుడి ప్రారంభమైంది, ఆమె ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుందని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

ఆ తర్వాత ఇటీవల యశోద ప్రమోషన్స్ లో భాగంగా తాను ఇప్పట్లో చనిపోయే పరిస్థితి లేదని అది అంత ప్రాణాంతకం అయితే కాదని సమంత చెప్పుకొచ్చింది. అయితే కొద్ది రోజులుగా టాలీవుడ్ ఫిలింనగర్ వర్గాల్లో సమంత ఆరోగ్యం మళ్ళీ చెడిపోయిందని ఆమె మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె మేనేజర్ అది నిజం కాదని ఆమె బాగానే ఉందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ప్రస్తుతానికి సమంత ఆరోగ్యం అయితే బాగానే ఉందని ఆమె ప్రస్తుతానికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలుస్తోంది.  సాధారణంగానే ఆర్గానిక్ విషయాల మీద ఆసక్తి చూపిస్తూ ఉండే సమంత ఇంగ్లీష్ మెడిసిన్ కంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ మంచి ప్రభావం చూపుతుందని భావిస్తూ ఆమె ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఆమె తన ముఖ కవళికలను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఇమ్యూనిటీని కూడా ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ బూస్ట్ చేయబోతుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఆమె అనారోగ్యం నుంచి కోలుకునే దారిలో ఉందని వీలైనంత త్వరలో కోలుకొని పలు సినిమాల్లో భాగమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని ఆమె హీరోయిన్గా నటిస్తున్న ఖుషి సినిమా యూనిట్ కు తెలియజేసిందని, డిసెంబర్ నుంచి షూటింగ్లో తాను పాల్గొంటానని అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చని ఆమె ఖుషీ మేకర్స్ కు సందేశం పంపినట్లుగా తెలుస్తోంది.

ఒకరకంగా ఇది అటు విజయ్ దేవరకొండ కి కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ సినిమాతో మళ్ళీ హిట్టు కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్న విజయ్ దేవరకొండకు సమంత అనారోగ్యం పెను శాపంగా మారింది. అయితే ఇప్పుడు ఆమె కోలుకుంటున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా కూడా త్వరగా పూర్తిచేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
Also Read: Jeevitha Rajasekhar: వాళ్లలానే నరేష్ చేతిలో మునిగిన జీవితా రాజశేఖర్.. నమ్మితే ఇదీ ఫలితం!

Also Read: Pavitra Lokesh: అల్లరి చేస్తున్నారు, ఆపండి.. నరేష్ పేరు లాగుతూ 'సైబర్ క్రైం'కు పవిత్ర ఫిర్యాదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News