Samantha Ignores Chai: నాగచైతన్యను అక్కడ కూడా దూరం పెట్టిన సమంత.. మరీ ఇలా అవసరమా?

13 Years for Ye Maya Chesave : నాగచైతన్య, సమంతా హీరో హీరోయిన్లుగా నటించిన ఏం మాయ చేశావే సినిమా విడుదలై 13 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో సమంతా, నాగచైతన్య షేర్ చేస్తున్న పోస్టులు కాకరేపుతున్నాయి. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 26, 2023, 04:03 PM IST
Samantha Ignores Chai: నాగచైతన్యను అక్కడ కూడా దూరం పెట్టిన సమంత.. మరీ ఇలా అవసరమా?

Samantha Ignoring Naga Chaitanya : సమంత హీరోయిన్ గా నాగచైతన్య హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన ఏం మాయ చేసావే సినిమా విడుదలై నేటితో 13 ఏళ్ల పూర్తయ్యాయి. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. జెస్సీ పాత్రలో సమంత, కార్తీక్ పాత్రలో నాగచైతన్య పరకాయ ప్రవేశం చేశారా అన్నంతగా ఈ సినిమాలో నటించారు. ఇక తనకంటే రెండేళ్ల పెద్దదైన అమ్మాయిని ప్రేమించే ఒక వ్యక్తిగా ఈ సినిమాలో నాగచైతన్య కనిపిస్తాడు. ఇక ఏ ముహూర్తాన ఈ సినిమా ఇద్దరూ కలిసి చేశారో తెలియదు కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టి పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు.

2017 అక్టోబర్లో వీరి వివాహం జరగగా 2021 అక్టోబర్ లోనే వీరు విడిపోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. వీరు విడిపోవడాని కంటే ముందు నుంచే వీరిద్దరూ విడిపోయే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఎవరూ నమ్మలేదు, అయితే చివరికి తాము విడిపోతున్నామంటూ ఈ జంట అధికారికంగా ప్రకటించడంతో ఈ జంటను అభిమానించే వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ తర్వాత సమంత తాను ఎంతో బాధ పడ్డానని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది కానీ నాగచైతన్య మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు, ఇక ఇప్పుడు ఏం మాయ చేసావే సినిమా విడుదలై 13 ఏళ్లు పూర్తయిన నేపద్యంలో వీరిద్దరూ తమ తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఈ సినిమా విడుదలై 13 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నాగచైతన్య ముందుగా సమంతతో కలిసి ఉన్న ఒక పోస్టర్ షేర్ చేసి ఏం మాయ చేసావే సినిమాకి 13 ఏళ్లు పూర్తయ్యాయి అంటూ పేర్కొన్నాడు. అలాగే మరొక డాన్స్ స్టిల్ కూడా ఆయన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు, అయితే సమంత మాత్రం నాగచైతన్య ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతూ కేవలం జెస్సీ పాత్రకు సంబంధించిన ఫోటోలను మాత్రమే షేర్ చేసి జెస్సీ పాత్రకు 13 ఏళ్లు ఏం మాయ చేసావే సినిమా విడుదలై 13 ఏళ్లు పూర్తయ్యాయి అంటూ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో నాగచైతన్య అభిమానులు మావాడు సమంత ఫోటో కూడా షేర్ చేస్తే ఆవిడ కావాలనే సొంతంగా తన ఒక్క ఫోటో మాత్రమే షేర్ చేసింది అంటూ విమర్శిస్తున్నారు.

వాస్తవానికి నాగచైతన్య వల్లే సమంత విడిపోయింది అని సమంత అభిమానులు, సమంత వల్లే నాగచైతన్య విడిపోయాడు అంటూ నాగచైతన్య అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అప్పట్లో యుద్ధాలు కూడా చేసుకున్నారు. తర్వాత ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారు,  ఇక సినిమాల పరంగా సమంత పాన్ ఇండియా లెవెల్ కి చేరుకుని పలు సినిమాలు చేస్తోంది. అయితే నాగచైతన్య పాన్ ఇండియా లెవల్లో చేసిన అటెంప్ట్ మాత్రం బోల్తాపడటంతో ఆయన మళ్లీ తెలుగు సినిమాలు చేస్తూ కొన్ని వెబ్ సిరీసులు కూడా చేస్తున్నారు.

Also Read Amala Paul Photos: మళ్లీ మొదటి చూపులోనే ప్రేమలో పడ్డ అమలాపాల్.. బోల్డ్ అవతారంలో ముద్దులతో రచ్చ

Also Read: Rithu Chowdary Back to Form: ఆ బాధ నుంచి బయట పడి మళ్లీ మొదలెట్టిన రీతూ చౌదరి.. దెబ్బకు మానేశారే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News