Samantha Tattoos:చైతూతో విడిపోయినా దాన్ని వదలని సమంత..అలా బయట పడిందిగా!

Samantha Having Chay's Tattoo on Ribs: సమంత నాగచైతన్య విడాకులు పూర్తి అయ్యాక కూడా సమంత నాగచైతన్యకు సంబందించిన టాటూ రిమూవ్ చేయలేదని తెలుస్తోంది. తాజాగా ఆ పొటోలు వైరల్ అయ్యాయి. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 3, 2023, 08:45 PM IST
Samantha Tattoos:చైతూతో విడిపోయినా దాన్ని వదలని సమంత..అలా బయట పడిందిగా!

Samantha Didn't Erase Chay's Tattoo on Ribs: సమంత నాగచైతన్య విడాకులు గురించి అనేక కథలు పుట్టుకొచ్చిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. వాస్తవానికి ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ మొదటిసారి కలిశారట. ఆ తర్వాత వారి మధ్య స్నేహం ఏర్పడడం ఆ స్నేహం ప్రేమగా మారడంతో వీరు పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు.

అయితే నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా విడుదలైన కొన్ని రోజులకు ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది, నిజానికి వీరు అధికారికంగా ప్రకటించడం కంటే ముందే సోషల్ మీడియాలో మీడియాలో వీరి విడాకుల గురించి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఆ సమయంలో వీరిద్దరూ తమ విడిపోవడం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో తిరుమల వెళ్లిన సమయంలో సమంత ఒక రిపోర్టర్ మీద అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అందరూ చూశారు.

దీంతో విడిపోరేమో అనుకున్నారు కానీ అనూహ్యంగా షాక్ ఇస్తూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే సమంత, నాగచైతన్య నుంచి విడాకులు అయితే తీసుకుంది కానీ ఆయన మీద తన ప్రేమ ఏమాత్రం తగ్గలేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయమైన క్లారిటీ లేదు. కానీ సమంత ఎప్పటికప్పుడు తాను చాలా బాధపడుతున్నాననే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానుల ముందు బయట పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటుంది.

Also Read: Tamannaah Unbuttoned Pic: చొక్కా విప్పేసి తమన్నా హాట్ ట్రీట్.. క్లీవేజ్ షోతో రచ్చోభ్యహ!

చైతన్య సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళుతుంటే సమంత మాత్రం నేనెందుకు వెనక్కి తగ్గాలి అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన రోజువారీ అప్డేట్స్ తో పాటు తన మానసిక వేదన కూడా సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నిజానికి ఈ మధ్య కాలంలో సమంత అమెరికాలోని ఒక వెబ్ సిరీస్ ప్రీమియర్ కు హాజరైంది. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రీమియర్ అవుతున్న నేపథ్యంలో సమంత ఈ వేడుకకు హాజరైంది.

బ్లాక్ కలర్ డ్రెస్ లో సమంత ఈ వేడుకకు హాజరు కాగా అందరి దృష్టి ఆమె టాటూల మీదే పడింది. నిజానికి సమంత తన శరీరం మీద మూడు టాటూలు వేయించుకుంది. అవి మూడు చైతన్యకు సంబంధించిన టాటూలే కావడం విశేషం. ఒక టాటూ ఆమె వీపు మీద వేయించుకుంది. మొదటిసారి చైతన్యను కలవడానికి కారణమైన ఏం మాయ చేసావే సినిమాకి గుర్తుగా వీపు మీద  వైఎంసి అనే అక్షరాలతో ఒక టాటూ వేయించుకుంది. ఆ తర్వాత రెండో ట్యాటూ విషయానికొస్తే ఆమె కుడి చేతి మీద రెండు యారో మార్కులు ఉంటాయి. ఇలాంటి మార్కులే నాగచైతన్య చేతి మీద కూడా ఉంటాయి.

వీరిద్దరూ కలిసి అప్పట్లో ఈ టాటూ వేయించుకున్నారు. అయితే ఇప్పుడు కుడి చేయి మీద, వీపు మీద టాటూ ఉందో లేదో అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ మరో మూడో టాటూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  సమంత తన కుడి పక్కటెముకల మీద చేయి అనే అక్షరాలు టాటూ వేయించుకుంది. అయితే చైతన్యతో విడాకులు కూడా తీసుకున్న సరే ఎందుకో ఆ అక్షరాలను మాత్రం ఆమె తొలగించినట్లుగా కనిపించడం లేదు. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసిన కొంతమంది సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.

Also Read: Manobala Greatness: రామోజీ ఫిలింసిటీకి వచ్చినప్పుడల్లా మనోబాల చేసే పని తెలిస్తే షాకవ్వక తప్పదు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News