Samantha Akkineni: సమంత సామ్ జామ్ షోకు నాగచైతన్య, అఖిల్

సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు.. మరోవైపు ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌‌తో బిజీగా ఉంటూనే మధ్యమధ్యలో సామ్ జామ్ షోతో అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సామ్ జామ్ షోలో సమంత చేస్తున్న ఇంటర్వ్యూలు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి.

Last Updated : Dec 22, 2020, 08:23 PM IST
  • అక్కినేని నాగార్జున కుటుంబం నుంచి సామ్ జామ్ షోకు అక్కినేని బ్రదర్స్.
  • అక్కినేని కుటుంబం నుంచి అనేక ఆసక్తికరమైన విశేషాలు రాబట్టనున్న సమంత అక్కినేని.
  • నాగచైతన్య, అఖిల్ అప్‌కమింగ్ మూవీస్‌పై లేటెస్ట్ అప్‌డేట్స్...
Samantha Akkineni: సమంత సామ్ జామ్ షోకు నాగచైతన్య, అఖిల్

సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు.. మరోవైపు ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌‌తో బిజీగా ఉంటూనే మధ్యమధ్యలో సామ్ జామ్ షోతో అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సామ్ జామ్ షోలో సమంత చేస్తున్న ఇంటర్వ్యూలు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. ఈ వారం సామ్ జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నారు. ఇంకేం... అటు మెగాస్టార్ ఫ్యాన్స్‌కి ఇటు సమంత ఫ్యాన్స్‌కి పండగే పండగ అన్నమాట. చిరు తన కొత్త సినిమా కథాకమామిషు, రాబోయే చిత్రాల విశేషాలు, పర్సనల్ లైఫ్ మేటర్స్ ( Chiranjeevi personal life ) ఎన్నో అభిమానులతో పంచుకోనున్నారన్నమాట.

ఇదిలావుంటే, అక్కినేని నాగార్జున కుటుంబం నుంచి అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ ( Akhil Akkineni ) కూడా సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ షోకి అతిథులుగా రానున్నట్టు తెలుస్తోంది. అదే కానీ జరిగితే ఆ ఎపిసోడ్‌లో అక్కినేని కుటుంబం నుంచి అనేక ఆసక్తికరమైన విశేషాలను సమంత కూపీ లాగి మరి ఆడియెన్స్‌కి చెప్పనుందన్నమాట.

Also read : Bigg Boss 4 contestant Sohel: సోహెల్‌ టాలెంట్‌కి బ్రహ్మానందం ఫిదా.. సోహెల్ సినిమాకు తనవంతు సాయం

నాగచైతన్య సినిమాల విషయానికొస్తే... ఇటీవలే లవ్ స్టోరీ సినిమా షూటింగ్ ( Naga Chaitanya love story movie ) ముగించుకున్న చైతూ ప్రస్తుతం థాంక్యూ సినిమాతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో చైతూ ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయనున్నాడు. మరోవైపు అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ( Most eligible bachelor movie ) బిజీగా ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డె జంటగా నటిస్తోంది.

Also read : Rakul Preet Singh: కరోనా బారిన పడ్డ రకుల్ ప్రీత్ సింగ్‌‌.. ట్వీట్

Also read : Who will be the Bigg Boss 4 Telugu winner: బిగ్ బాస్ తెలుగు 4 విన్నర్ అతడే : అలీ రెజా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News