Samajavaragamana full video song : మళ్లీ దుమ్ములేపుతున్న సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్

సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్ దుమ్ములేపుతోంది. ఇదివరకే ఈ ఆడియో సాంగ్ విన్నప్పటికీ... ఇప్పటికీ ఆ సాంగ్‌పై క్రేజ్ తగ్గలేదనడానికి నిదర్శనంగా వీడియో సాంగ్ కూడా యూట్యూబ్‌పై అంతే వేగంగా ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ సరసన జంటగా నటించిన పూజా హెగ్డే గ్లామర్‌తో పాటు ప్యారీస్ అందాలను కూడా వీడియోలో అంతే అందంగా బంధించారు.

Last Updated : Feb 17, 2020, 02:47 PM IST
Samajavaragamana full video song : మళ్లీ దుమ్ములేపుతున్న సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్

అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ అల వైకుంఠపురములో సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అదేవిధంగా ఆ సినిమా పాటలు కూడా అంతే హిట్ అయ్యాయని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే... అల వైకుంఠపురములో సినిమా ( #AlaVaikunthapurramuloo ) విడుదల కంటే ముందుగా ఆ సినిమా పాటలే బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు ఆ చిత్రంపై ఆడియెన్స్‌లో భారీ అంచనాలు పెంచేలా చేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎస్ఎస్ థమన్ కంపోజిషన్‌లో రూపొందిన అల వైకుంఠపురములో పాటలు ఆ సినిమానే మ్యూజికల్ హిట్ చేశాయి. రాములో రాములా పాట ఏకంగా 200కుపైగా మిలియన్ వ్యూస్ ( Ramuloo ramulaa song )  సొంతం చేసుకుని దక్షిణాది చిత్రాలకు సంబంధించిన పాటల్లో ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. సంగీతం పరంగా అంతటి ప్రాధాన్యత కలిగిన ఆ పాటలను వీడియో రూపంలో విడుదల చేసి మరోసారి ఆడియెన్స్‌ని ఎట్రాక్ట్ చేసుకుంటున్నారు ఆ చిత్ర నిర్మాతలు. అందులో భాగంగానే తాజాగా సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం అల వైకుంఠపురములో మ్యూజిక్ పార్ట్‌నర్ ఆదిత్య మ్యూజిక్ సామజవరగమన వీడియో సాంగ్‌ను ( Samajavaragamana Video Song ) విడుదల చేయగా.. 20 గంటలు కూడా పూర్తి కాకముందే ఈ పాట 4 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ సరసన జంటగా నటించిన పూజా హెగ్డే గ్లామర్‌తో పాటు ప్యారీస్ అందాలను కూడా వీడియోలో అంతే అందంగా బంధించారు. ఇక అల్లు అర్జున్ సింప్లీ స్టైలిష్ డ్యాన్సింగ్ గురించి చెప్పనక్కరేలేదు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

ఇప్పటికే ఆడియో సాంగ్ సంచలనం సృష్టించగా.... తాజాగా సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్ దుమ్ములేపుతోంది. ఇదివరకే ఈ ఆడియో సాంగ్ విన్నప్పటికీ... ఇప్పటికీ ఆ సాంగ్‌పై క్రేజ్ తగ్గలేదనడానికి నిదర్శనంగా వీడియో సాంగ్ కూడా యూట్యూబ్‌పై అంతే వేగంగా ట్రెండ్ అవుతోంది. '' నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు..'' అని ఆ పాట లిరిక్స్ మొదలైనట్టుగానే... తెలుగు సినిమా సంగీత ప్రియుల చెవులను కూడా సామజవరగమన సాంగ్ పట్టుకు వదలడం లేదు. Read also : పూజా హెగ్డే నోట.. సామజవరగమన పాట..

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాట రాయగా థమన్ కంపోజిషన్‌లో ప్రముఖ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరాం ఈ పాటను ఆలపించాడు. Read also : ‘సామజవరగమన’కు కేటీఆర్ ఫిదా.. థమన్ ఫుల్ జోష్

త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కి సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలైంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్ రాధాకృష్ణ (చినబాబు), అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డె జంటగా నటించగా.. టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరాం, సుశాంత్, వెన్నెల కిషోర్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, హర్షవర్ధన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News