Salman Khan Pooja Hegde: సల్మాన్ భాయ్.. ఏంటా చిలిపి పని! పూజా హెగ్డేను ఏం చేస్తున్నావ్! (వీడియో)

Salman Khan dances with Pooja Hegde: సల్మాన్ ఖాన్‌ డాన్స్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.  హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి సల్మాన్ చేసిన స్టెప్పులపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 02:33 PM IST
  • పూజా హెగ్డేతో సల్మాన్ ఖాన్‌ డాన్స్
  • సల్మాన్ స్టెప్పులపై జోకులు పేల్చుతున్న నెటిజన్లు
  • సల్మాన్ భాయ్.. ఏంటా చిలిపి పని
Salman Khan Pooja Hegde: సల్మాన్ భాయ్.. ఏంటా చిలిపి పని! పూజా హెగ్డేను ఏం చేస్తున్నావ్! (వీడియో)

Salman Khan fails to perform hook step with Pooja Hegde: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం వైరల్ అవుతోంది. ఇక సెలెబ్రిటీలకు సంబందించిన విషయం అయితే క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్‌ డాన్స్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోయిన్, బుట్టబొమ్మ పూజా హెగ్డేతో కలిసి సల్మాన్ చేసిన స్టెప్పులపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. అసలు విషయంలోకి వెళితే... 

వీక్ ఎండ్ కావడంతో 'డా-బ్యాంగ్ ది టూర్ రీలోడెడ్' అనే ఈవెంట్ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, దిశా పటానీ, సోనాక్షి సిన్హాతో పాటు పలువురు స్టార్లు పాల్గొన్నారు. ఈవెంట్‌లో భాగంగా పూజా హెగ్డేతో కలిసి తన 'కిక్' చిత్రంలోని 'జుమ్మీ కి రాత్' అనే పాటకు సల్మాన్ డాన్స్ చేశాడు. ఆ పాటలోని హుక్‌స్టెప్‌ను పూజాతో సల్లు భాయ్ ట్రై చేశాడు. పూజా ముందు నడుస్తుండగా.. ఆమె డ్రెస్‌ను పంటితో పట్టుకోవడంలో విఫలమయ్యాడు. 

ఒరిజినల్ 'జుమ్మీ కి రాత్' పాటలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముందుకు నడుస్తున్నప్పుడు ఆమె కోటును సల్మాన్ ఖాన్ తన పళ్లతో పట్టుకుని ఓ హుక్‌స్టెప్ వేస్తాడు. అయితే 'డా-బ్యాంగ్ ది టూర్ రీలోడెడ్' ఈవెంట్‌లో పూజా హెగ్డే పొట్టి డ్రెస్ వేసుకోవడంతో.. సల్మాన్ హుక్‌స్టెప్‌ను వేయడంలో విఫలమవుతాడు. పూజను ఆపి మరీ ఆ స్టెప్ వేయడానికి ప్రయత్నించినా.. డ్రెస్ పెద్దగా లేకపోవడంతో అది కుదరలేదు. దాంతో పూజా సహా సల్మాన్ కూడా నవ్వులు పూయించారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Salman Khan (@beingkhantr)

సల్మాన్ ఖాన్ హుక్‌స్టెప్‌కు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. beingkhantr అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూసర్ తన ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే వేళల్లో లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. నెటిజన్లు సరదాగా సల్మాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. 'సల్మాన్ భాయ్.. ఏంటా చిలిపి పని' ఒకరు కామెంట్ చేయగా.. 'పూజా హెగ్డేను ఏం చేస్తున్నావ్' అంటూ మరొకరు  కామెంట్ చేశారు. ప్రస్తుతం సల్మాన్, పూజా 'కభీ ఈద్ కభీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. 2023లో ఈ సినిమా విడుదల కానుంది. 

Also Read: IND vs SL: 146 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బౌన్సర్‌‌.. టీమిండియా స్టార్ ఆటగాడి తలకు గాయం! అర్దరాత్రి ఆసుపత్రికి తరలింపు!

Also Read: Amazon Offers: ఆ షియోమీ మొబైల్‌పై 7 వేల ఆఫర్.. ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా! మరికొద్ది గంటలు మాత్రమే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News