Arjun Kapoor: సల్మాన్ ఖాన్ చెప్పినట్లే చేశా.. కానీ!: బోనీ కపూర్

బాలీవుడ్‌లో కోల్డ్ వార్ జరుగుతోంది. కండలవీరుడు సల్మాన్ ఖాన్, బోనీ కపూర్‌ల కుటుంబాల మధ్య సాన్నిహిత్యం తగ్గిపోయింది. అందుకు కారణం మలైకా అరోరా, అర్జున్ కపూర్‌లు చెట్టాపట్టాలేసుకుని తిరగడమేనని బాలీవుడ్ కోడై కూస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 17, 2020, 11:03 AM IST
Arjun Kapoor: సల్మాన్ ఖాన్ చెప్పినట్లే చేశా.. కానీ!: బోనీ కపూర్

కండలవీరుడు సల్మాన్ ఖాన్, హిట్ సినిమాల డైరెక్టర్ బోనీ కపూర్ కాంబినేషన్‌లో 'వాంటెడ్', 'నో ఎంట్రీ' వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే 2009 తరువాత వీరిద్దరు కలిసి ఏ ప్రాజెక్ట్ చేయలేదు. కలిసి సినిమా తీయాలనుకున్నా ప్రస్తుతం పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు. తన కుమారుడు అర్జున్ కపూర్‌ను హీరోగా తీర్చిదిద్దాలన్నది సల్మాన్ సలహానేనని బోనీ కపూర్ వెల్లడించారు. తాజాగా ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. 

Also Read: మలైకా అరోరా, అర్జున్ రిలేషన్ దెబ్బకొట్టింది!

దివంగత నటి శ్రీదేవి మరణం నుంచి  బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ 'ధడక్' చిత్రంతో సినీ అరంగేట్రం చేశారు. రెండో కూతురు ఖుషీ కపూర్ సినిమాల్లో త్వరలో కనిపించనుంది. తొలి భార్య ద్వారా బోనీకి అర్జున్ కపూర్, అన్షులా కపూర్ సంతానం ఉన్నారు. అయితే అర్జున్ కపూర్ కెరీర్ పరంగా ఏ ఇబ్బంది లేదు. అయితే వ్యక్తిగత విషయాలు సల్మాన్ కుటుంబంతో విభేదాలకు దారితీస్తున్నాయని బోనీ కపూర్ అభిప్రాయపడ్డారు.

Also Read: ఉత్తమ నటిగా RRR భామ.. రాజమౌళి నిర్ణయం కరెక్ట్!

‘అర్జున్ కపూర్ ఎప్పుడూ దర్శకుడు కావాలని కలలు కన్నాడు. అయితే అర్జున్‌ను హీరో చేస్తే కెరీర్ బాగుంటుందని సల్మాన్ నాకు సలహా ఇచ్చాడు. ఆయన చెప్పినట్లే అర్జున్‌ను హీరో చేశాం. అర్జున్‌లో హీరో లక్షణాలున్నాయని, త్వరలో కెరీర్‌లో మంచి స్థాయిలో ఉంటాడని సల్మాన్ నాకు సూచించాడు. సల్మాన్ ఊహించినట్లుగానే అర్జున్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గతంలో మాదిరిగా మా మధ్య మాటలు లేవు. కుటుంబాల మధ్య దూరం పెరిగింది. అర్జున్ కెరీర్‌పై నమ్మకం ఉంచి నాకు సలహా ఇచ్చిన సల్మాన్ అంటే నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని’ బోనీ కపూర్ తన మనసులోని మాటలు బయటపెట్టారు.

Also Read; ఆ హీరోయిన్ వచ్చిన వేళా విశేషం.. నితిన్‌కు పెళ్లి!

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నుంచి మలైకా అరోరా విడాకులు తీసుకున్నారు. అనంతరం అర్జున్ కపూర్‌తో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరడగం సల్మాన్ ఖాన్‌తో పాటు తనకు ఇబ్బంది కలిగించిందని బోనీ కపూర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. మలైకాతో సంబంధాన్ని కొనసాగిస్తే సల్మాన్‌తో అర్జున్‌కు ఇబ్బందులు తప్పవని, అతడి కెరీర్ ఏమైపోతుందోనని సైతం బోనీ మధనపడుతున్నారు.

Also Read: రికార్డులు తిరగరాసిన ప్రభాస్ ‘సాహో’

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News