Saindhav promotions: సైంధవ్‌ ప్రమోషన్స్‌ షురూ.. బస్సులో వెంకటేశ్, శైలేష్..

Saindhav Movie: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ 75వ చిత్రం సైంధవ్‌. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీకి శైలేష్‌ కొలను దర్శకత్వం వహించాడు. తాజాగా మూవీ ప్రమోషన్స్ ను షురూ చేసింది వెంకీ టీం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2023, 01:12 PM IST
Saindhav promotions: సైంధవ్‌ ప్రమోషన్స్‌ షురూ.. బస్సులో వెంకటేశ్, శైలేష్..

Saindhav Movie Promotions: విక్టరీ వెంకటేశ్ (Venkatesh) టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం సైంధవ్‌ (Saindhav). హిట్ ఫేం శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ను షురూ చేసింది శైలేష్ టీం. ఇందులో భాగంగా.. ఇవాళ విజయవాడ, గుంటూరు పట్టణాల్లో సెకండ్‌ సింగిల్‌ లాంఛ్ ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. మధ్యాహ్నం 2 గంటలకు VVIT Collegeలో సాయంత్రం 5 గంటలకు KLU Universityలో విద్యార్థుల మధ్య సాంగ్‌ను లాంఛ్ చేయనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో విజయవాడకు బయలుదేరింది సైంధవ్ టీం. వెంకీ, శైలేష్ బస్సులో పయనిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  

ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్ వచ్చింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ వెంకటేశ్ కు 75వ సినిమా. దీంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి.  ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌ మిషన్‌ నేపథ్యంలో సాగే సైంధవ్‌లో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్‌  హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. 

Also Read: Vakantham Vamsi: ఎన్టీఆర్ 'టెంపర్' వివాదం.. వక్కంతం వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News