Ruhani Sharma : సైంధవ్ మూవీలో హీరోయిన్‌గా విరాట్ కోహ్లీ మరదలు.. ఈ ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా..!

Virat Kohli: సుశాంత్ హీరోగా చేసిన చి.ల.సౌ సినిమాతో మనకు పరిచయమైన హీరోయిన్ రుహాణి శర్మ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ నటి. కాగా ప్రస్తుతం సైంధవ్ సినిమా ప్రమోషన్స్ లో తన గురించి ఒక విషయం బయట పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2024, 06:55 PM IST
Ruhani Sharma : సైంధవ్ మూవీలో హీరోయిన్‌గా విరాట్ కోహ్లీ మరదలు.. ఈ ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా..!

Ruhani Sharma: హీరోయిన్ రుహాణి శర్మ కడైసి బెంచ్ కార్తీ అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత రాహుల్ దక్షకత్వంలో సుశాంత్ హీరోగా చేసిన తెలుగు సినిమా చిలసౌ లో  హీరోయిన్గా చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె పాత్ర ఎక్కువగా ఆమె నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. మొదటి సినిమాతోనే తెలుగులో సూపర్ హిట్ అందుకుంది ఈ నటి. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ వస్తుంది. అడపాదడపా వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. కానీ ఇప్పటివరకు స్టార్ హీరో సినిమాలో ఛాన్సులు అయితే ఈ హీరోయిన్ కి రాలేదు. ఈ నేపథ్యంలో ఫైనల్ గా ఆమెకు వెంకటేష్ హీరోగా చేస్తున్న సైంధవ సినిమాలో అవకాశం రావడం ఆమె అభిమానులను ఖుషీ చేసింది. ఈ సంక్రాంతికి తెలుగులో సైంధవ్‌ సినిమా సినిమా విడుదల కానుంది.

విడుదల తేది దగ్గర పడుతూ ఉండడంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది‌ ఈ హీరోయిన్. 
శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సైంధవ్‌ సినిమాలో రుహాణి శర్మ ఓ డాక్టర్ పాత్ర చేసింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి అలానే తన పర్సనల్ విషయాలు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్.

ముందుగా సినిమా గురించి రుహాణి శర్మ మాట్లాడుతూ.. ‘వెంకటేష్ గారివి చాలా సినిమాలు చూశాను. ఎక్కువగా నేను హిందీ డబ్బింగ్ సినిమాలు చూశాను. వెంకటేష్ గారంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నా. కానీ తర్వాత నా డ్రీమ్ మారిపోయి ఇలా హీరోయిన్ అయ్యాను. అందుకే నాకు సైంధవ్‌ సినిమాలో డాక్టర్ గా చేయడం ఆనందంగా అంది. ఇలా అయినా నా చిన్నప్పటి డ్రీం నెరవేరింది’ అని చెప్పుకొచ్చింది.
ఇక బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తనకి సిస్టర్ అవుతుంది అని చెప్పకువచ్చింది.  

విరాట్ బావ అవుతాడు కదా అని యాంకర్ అడగ్గా.. ‘అవును, ఇది సీక్రెట్. నా పర్సనల్స్ ఎప్పుడు నేను చెప్పలేదు. ఈ విషయం మీకు ఎలా తెలిసింది? మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ విషయం బయట పెడుతున్నాను. అనుష్క శర్మ నాకు సిస్టర్ అవుతుంది. అలా నాకు విరాట్ కోహ్లీ బావ అవుతారు. విరాట్ చాలా మంచివాడు. వాళ్ళు అందరితో కూడా చాలా మంచిగా ఉంటారు, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా సింపుల్ గా ఉంటారు వాళ్ళిద్దరూ. అందుకే వాళ్ళు అంటే నాకు  ఇష్టం’ అని తెలిపింది. 

కాగా ఇలా మన తెలుగు హీరోయిన్ కి విరాట్ కోహ్లీ బావ అవుతారు అని తెలియడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News