15000 crores loss for Saif Ali Khan : బాలీవుడ్ లో బడా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీఖాన్ కి తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పటౌడి కుటుంబానికి చెందిన సుమారుగా రూ.1500 కోట్ల ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు ఆస్తులపై కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. పటౌడి ఆస్తులపై 2015లో విధించిన స్టే ని ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. 1968 నాటి ఎనిమీ ప్రాపర్టీ ఆక్ట్ ప్రకారం పటౌడి కుటుంబ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే పటౌడి వంశానికి చెందిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు ఆ ప్రాపర్టీ తో సంబంధం ఉంది. సైఫ్ పూర్వీకులకు చెందిన ఆస్తుల్లో ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ ఉన్నది
ఇక్కడే సైఫ్ అలీ ఖాన్ తన బాల్యం మొత్తం గడిపాడుm ఇప్పుడు ఈ ప్రాపర్టీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుందని సమాచారం mమధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ వివేక్ అగర్వాల్ ఈ కేసులో తీర్పుని ఇస్తూ.. ఎనిమీ ప్రాపర్టీ ఆక్ట్ ప్రకారం సంబంధిత వ్యక్తులు 30 రోజుల్లోగా పిటీషన్లు దాఖలు చేసుకోవచ్చు అని కూడా తెలిపారు. అసలు విషయంలోకెళితే, దేశ విభజన తర్వాత పాకిస్థాన్కు వలస వెళ్లిన వారి స్థిర ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ ఆక్ట్ కింద స్వాధీనం చేసుకుంటుంది.
చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు అబిదా సుల్తాన్ 1950 లోనే పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది. రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ భారత్ లోనే ఉండిపోయారు. నవాబ్ ఇఫ్తికర్ అలీఖాన్ పటౌడిని ఆమె పెళ్లి చేసుకున్నారు. దాంతో పటౌడి ఆస్తులకు ఆమె చట్టపరమైన వారసురాలు అయ్యింది. ఇక సాజిదా సుల్తాన్ మనవడే సైఫ్ అలీఖాన్. దీంతో పటౌడి ప్రాపర్టీలలో కొంత షేర్ ఈయనకు వస్తుంది.
అయితే అబిదా సుల్తాన్ వలస వెళ్లడం వల్ల ఆ ప్రాపర్టీని ఎనిమీ ప్రాపర్టీగా భావిస్తూ ప్రభుత్వం జప్తు చేయడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తి ఇప్పుడు ప్రభుత్వం ఖాతాలోకి వెళ్ళబోతున్నట్లు సమాచారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter