Saidharam tej health condition: సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన మాదాపూర్ ఏసీపీ

Saidharam tej health condition latest updates: ప్రముఖ సినీ నటుడు సాయిధరమ్ తేజ్‌కి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ (Saidharam tej injured) స్పృహ కోల్పోవడంతో వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం సాయిధరమ్ తేజ్‌ని అపోలో ఆస్పత్రికి తరలించారు.

Written by - Pavan | Last Updated : Sep 11, 2021, 12:23 AM IST
  • సాయిధరమ్ తేజ్‌కి రోడ్డు ప్రమాదంలో గాయాలు (Sai dharam tel injured in road accident)
  • ప్రమాదంలో గాయపడిన అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్
  • అపోలో ఆస్పత్రిలో సాయి ధరమ్ తేజ్‌కి చికిత్స (Saidharam tej's health condition)
Saidharam tej health condition: సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన మాదాపూర్ ఏసీపీ

Saidharam tej health condition latest updates: ప్రముఖ సినీ నటుడు సాయిధరమ్ తేజ్‌కి హైదరాబాద్‌లోని దుర్గం చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ (Saidharam tej injured) స్పృహ కోల్పోవడంతో వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం సాయిధరమ్ తేజ్‌ని అపోలో ఆస్పత్రికి తరలించారు. 

సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్‌పై దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్డి (Durgam cheruvu cable bridge) నుంచి ఐకియా చౌరస్తాకు వస్తుండగా శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఈ ఘటన జరిగింది. స్పీడ్ లిమిట్‌కి మించి వేగంతో వెళ్తుండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని వార్తలొస్తున్నాయి. అపోలో ఆస్పత్రి వెలుపల మాదాపూర్ ఏసీపీ వెంకట రమణ (Madhapur ACP Venkata Ramana) మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో వైద్యులు చెప్పినట్టు తెలిపారు. 

Also read : Breaking News: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్

సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్‌పై (Sai dharam tej's sports bike) మితిమీరిన వేగంతో వెళ్లడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని తెలుస్తోందని, దీనిపై మీరు ఏమని స్పందిస్తారని పాత్రికేయులు ప్రశ్నించగా.. సాయిధరమ్ తేజ్ (Saidharam tej) రోడ్డు ప్రమాదానికి గురైన చోట ఉన్న సీసీటీవీ ఫుటేజీ విజువల్స్ పరిశీలించాల్సి ఉందని, ఆ తర్వాతే ఏదైనా చెప్పగలం అని ఏసీపీ వెంకట రమణ తెలిపారు.

సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అతడిని కాపాడుకోవడం కోసం మేన మామ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), వరుణ్ తేజ్, నిహారిక ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సాయి ధరమ్ తేజ్‌కి రోడ్డు ప్రమాదం వార్త అటు మెగాస్టార్ ఫ్యామిలీనే కాదు.. ఇటు మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు ఆడియెన్స్‌ని సైతం ఆందోళనకు గురయ్యేలా చేసింది. సాయిధరమ్ ఈ ప్రమాదం నుంచి కోలుకుని సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం. 

Also read : Sai Dharam Tej's Republic movie director Deva Katta: సినిమా టికెట్ల అమ్మకాలు.. Ap govt పై దేవ కట్టా విమర్శలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News